FASTag collections: రికార్డు స్థాయిలో ఫాస్టాగ్ వసూళ్లు..మార్చిలో ఎంతంటే..?

దేశవ్యాప్తంగా ఫాస్టాగ్ వసూళ్లు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. మార్చిలో టోల్ చెల్లింపులు రూ.4 వేల 95 కోట్లకు చేరాయి. గతేడాది ఇదే నెలతో పోలిస్తే వసూళ్లలో 33 శాతం వృద్ధి నమోదైంది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 9, 2022, 04:11 PM IST
  • దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఫాస్టాగ్ వసూళ్లు
  • మార్చిలో రూ.4,095 కోట్ల వసూళ్లు
  • గతేడాదితో పోలిస్తే 33 శాతం అధికం
FASTag collections: రికార్డు స్థాయిలో ఫాస్టాగ్ వసూళ్లు..మార్చిలో ఎంతంటే..?

FASTag collections: దేశవ్యాప్తంగా ఫాస్టాగ్ వసూళ్లు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. మార్చిలో టోల్ చెల్లింపులు రూ.4 వేల 95 కోట్లకు చేరాయి. గతేడాది ఇదే నెలతో పోలిస్తే వసూళ్లలో 33 శాతం వృద్ధి నమోదైంది.

2016లో ఫాస్టాగ్ వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చారు. ఒక నెలలో ఈస్థాయిలో వసూళ్లు రావడం ఇదే తొలిసారి. గత ఆర్థిక సంవత్సరం మొత్తంలో ఫాస్టాగ్ టోల్ వసూళ్లు రూ.38 వేల 84 కోట్లుగా నమోదైంది. గతేడాదితో పోలిస్తే ఈ మొత్తం 68 శాతం అధికమని అధికారులు తెలిపారు. ఈ మొత్తంలో దాదాపు మూడోవంతు చివరి త్రైమాసికంలోనే వసూలైందని వెల్లడించారు. 

జాతీయ రహదారులపై ఉన్న అన్ని టోల్ ప్లాజాలను ఫాస్టాగ్ లేన్లుగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రయాణికుల వాహనాల్లో దాదాపు 97 శాతం ఫాస్టాగ్ విధానానికి మారాయి. ఈ విషయాన్ని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. 2022-23లో ఫాస్టాగ్ టోల్ వసూళ్లు రూ.35 వేల కోట్లకు పైగా వసూలవుతాయని కేంద్రం అంచనా వేస్తోంది. ఇటీవల జీఎస్టీ వసూళ్లు సైతం రికార్డు స్థాయిలో నమోదైయ్యాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా జీఎస్టీ వసూళ్లు వచ్చాయి. గత నెలలో మొత్తం రూ.1.42 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదైనట్లు ఆర్థిక వ్యవస్థ వెల్లడించింది.

Also read: Renault offers: రెనో కార్లపై అదిరే ఆఫర్లు.. రూ.1.1 లక్షల వరకు డిస్కౌంట్లు

Also read: Indian Railways Concession: సీనియర్ సిటిజన్స్ కు గుడ్ న్యూస్.. రైలు ప్రయాణాలపై రాయితీ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News