Best Compact SUV: భారత మార్కెట్‌లో ఇప్పటికే మారుతి, టాటా, కియా, హ్యుండయ్, మహీంద్రా కంపెనీల నుంచి SUV కార్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా Compact SUVలకు క్రేజ్ పెరుగుతోంది. అదే క్రమంలో మహీంద్రా కంపెనీ కొత్తగా Mahindra XUV 3XO లాంచ్ చేసింది. ఇతర ఎస్‌యూవీలతో ఈ కారును పోల్చి చూద్దాం. ఏ ఎస్‌యూవీ ఎక్కువ మైలేజ్ ఇస్తుందో పరిశీలిద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Mahindra XUV 3XOలో 1.2 లీటర్‌తో 3 సిలెండర్ టర్బో, 3 సిలెండర్ టర్బో టీజీడీఐ ఇంజన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో 1.2 లీర్ టర్బో పెట్రోల్ ఇంజన్ అయితే 111 హార్స్ పవర్, 200 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి సామర్ధ్యం కలిగి ఉంటుంది. అదే 1.2 లీటర్ టర్బో టీజీడీఐ ఇంజన్ అయితే 131 హార్స్ పవర్, 230 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. ఇందులోనే 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్ కూడా ఉంది. మహీంద్ర కంపెనీ అంచనాల ప్రకారం మైలేజ్ 17.96 కిలోమీటర్ల నుంచి 21.2 కిలోమీటర్లు ఇస్తుంది. 


Kia Compact SUV సోనెట్ వేరియంట్‌లో ఉంది. ఇందులో కూడా మూడు ఇంజన్ ఆప్షన్స్ ఉన్నాయి. 1.0 లీటర్ జీడీఐ పెట్రోల్ ఇంజన్ అయితే 88 హార్స్ పవర్, 172 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. ఇక రెండవది 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ 61 హార్స్ వపర్, 115 ఎన్ఎం టార్క్ సామర్ధ్యం కలిగింది. ఇక మూడవది 1.5 లీటర్ సీఆర్డీఐ ఇంజన్ 85 హార్స్ పవర్, 250 ఎన్ఎం టార్క్ జనరేట్ చేయగలదు. Kia Sonet Compact SUV లీటర్‌కు 18.2 కిలోమీటర్ నుంచి 22.3 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. 


Maruti Brezza Compact Suv పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ కలిగి ఉంటుంది. ఇందులో 1462 సిసి కే సిరీస్ ఇంజన్ ఉంది. 100 హార్స్ పవర్, 136 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేయగల సామర్ధ్యం కలిగింది. మైలేజ్ అయితే లీటర్‌కు 17.38-19.89 కిలోమీటర్లు ఇస్తుంది. 


Tata Nexon Compact SUV వేర్వేరు రకాల ఇంజన్ ఆప్షన్లతో వస్తోంది. ఇందులో 1.2 లీటర్ టర్బో రెవోట్రాన్ ఇంజన్ ఉంటుంది. 88 హార్స్ పవర్, 170 ఎన్ఎం టార్క్ జనరేట్ చేయగలదు. ఇక 1.5 లీర్ టర్బో ఛార్జ్డ్ డీజిల్ ఇంజన్ అయితే 84.5 కిలోవాట్ల హార్స్ పవర్, 260 ఎన్ఎం టార్క్ సామర్ధ్యం కలిగి ఉంటుంది. లీటరుకు 17-24.08 కిలోమీటర్లు మైలేజ్ ఇస్తుంది.


Hyundai compact Suv మూడు ఇంజన్ ఆప్షన్లలో వస్తోంది. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ అయితే 61 కిలోవాట్ల హార్స్ పవర్ 113 ఎన్ఎం టార్క్ సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఇక 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ అయితే 88.3 కిలోవాట్ల హార్స్ పవర్, 172 టార్క్ జనరేట్ చేయగలదు. ఇక 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ అయితే 85 కిలోవాట్ల హార్స్ పవర్, 250 ఎన్ఎం టార్క్ జనరేట్ సామర్ధ్యం ఉంటుంది. ఈ కారు 17.5 కిలోమీటర్ల నుంచి 23.7 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని అంచనా. 


Also read: Flipkart Smart Watch Offers: 6 వేల స్మార్ట్‌వాచ్ కేవలం 999 రూపాయలకేనా, ఎలాగంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook