Credit Score: పెళ్లికి..క్రిడెట్ కార్డుకు లింకేంటి? పెళ్లి చేసుకుంటే క్రెడిట్ స్కోర్‌పై ఎఫెక్ట్ పడుతుందా? ఏందిరా చారీ ఇది
Credit Score: క్రెడిట్ కార్డు వాడటం చాలా మంది స్టేటస్‌గా భావిస్తుంటారు. చాలా మంది దగ్గర క్రెడిట్ కార్డులు ఉంటాయి. సకాలంలో ఈఎంఐలు చెల్లిస్తూ తమ క్రెడిట్ స్కోర్ ను మెరుగ్గా ఉండే విధంగా చూసుకుంటారు. కానీ పెళ్లి తర్వాత పరిస్థితులు మారుతుంటాయి. ఎందుకంటే పెళ్లి తర్వాత ఖర్చులు ఎక్కువ అవుతుంటాయి. ఇలాంటివి మీ క్రెడిట్ స్కోర్ పై ఎఫెక్ట్ చూపే ఛాన్స్ ఉంటుంది. ఎలా చూద్దాం.
Credit Score: క్రెడిట్ స్కోర్ అనేది మీ స్టేటస్, లోన్ తీర్చే సామార్థ్యాన్ని తెలుపుతుంది. సాధారణంగా ఈ క్రెడిట్ స్కోర్ 300 నుంచి 900 మధ్య ఉంటుంది. క్రెడిట్ స్కోర్ 750 కంటే ఎక్కువగా ఉంటే..దానిని మంచి క్రెడిట్ స్కోర్ అని చెప్పవచ్చు. ఈ క్రెడిట్ స్కోర్ ను క్రెడిట్ బ్యూరోలో ఇస్తుంటాయి. ఇండియాలో ప్రధానంగా నాలుగు క్రెడిట్ బ్యూరో సంస్థలు ఉంటాయి.
అందులో సిబిల్,ఎక్స్ పీరియన్, సీఆర్ఐఎఫ్, ఈక్విఫాక్స్..ఈక్రెడిట్ బ్యూరోలు వినియోగదారుల క్రెడిట్ రిపోర్టులు రూపొందించడానికి వారి సమాచారాన్ని సేకరిస్తుంటాయి. వాటిని ఆర్గనైజ్ చేసి, వ్యక్తుల క్రెడిట్ స్కోరును నిర్ణయిస్తాయి.
1.కొత్తగా పెళ్లయిన దంపతులు జాయింట్ బ్యాంకు అకౌంట్ తీసుకోవడం లేదా హోంలోన్ తీసుకుంటుంటారు. జాయింట్ గా హోంలోన్ కోసం అప్లయ్ చేసినప్పుడు బ్యాంకులు ఇద్దరు భాగస్వాముల క్రెడిట్ స్కోర్ లను పరిగణలోనికి తీసుకుంటారు. ఇద్దరిలో ఎవరికి తక్కువ స్కోర్ ఉంటే వారు ఎక్కువ వడ్డీ రేట్లు పొందేందుకు , లోన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
2.ఒక జంట తమ క్రెడిట్ స్కోర్‌లలో ఒకటి లేదా రెండూ తక్కువగా ఉన్నట్లు భావిస్తే, కారణాలను గుర్తించడం.. వాటిని మెరుగుపరచడానికి కృషి చేయడం ముఖ్యం. ఇది వారి రుణ ఆమోద అవకాశాలను పెంచుతుంది. తక్కువ వడ్డీ రేట్లకు దారితీయవచ్చు. వివాహం తర్వాత, ఇద్దరూ తమ క్రెడిట్ స్కోర్‌లను నిర్వహించడంలో చురుకుగా ఉండటం చాలా ముఖ్యం.
3.వివాహం అనేది రెండు జీవితాలను కలిపేయడమే కాకుండా వారి ఆర్థిక గుర్తింపులను కూడా కలుపుతుంది. ఇది క్రెడిట్ స్కోర్‌పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఉమ్మడి ఖాతాలు, రుణాలు వారి వ్యక్తిగత క్రెడిట్ స్కోర్‌లను ఎలా ప్రభావితం చేస్తాయో దంపతులు తెలుసుకోవాలి. వీటిని అర్థం చేసుకోవడం ద్వారా, వారి క్రెడిట్ స్కోర్‌లను నిర్వహించడానికి లేదా మెరుగుపరచడానికి కలిసి పని చేయడం ద్వారా, వివాహిత జంటలు మెరుగైన ఆర్థిక ప్రణాళికను నిర్ధారించుకోవచ్చు.
4. భార్యాభర్తలలో ఎవరైనా క్రెడిట్ కార్డ్ లేదా లోన్ తిరిగి చెల్లించడంలో జాప్యం చేసినా లేదా EMI బౌన్స్ అయినట్లయితే, మీరు ఉమ్మడి ఖాతాను తెరిచిన వెంటనే దాని ప్రభావం మీ క్రెడిట్ స్కోర్‌పై కనిపిస్తుంది. దీని కారణంగా మీ క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుంది.
5. జాయింట్ EMIలు బిల్లులను సకాలంలో చెల్లిస్తే, అది ఖచ్చితంగా మీ క్రెడిట్‌పై సానుకూల ప్రభావం చూపుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.