Legal Documents: సిటీలో మంచి ప్రాపర్టీ కొనాలంటే ఏ డాక్యుమెంట్స్‌ ఉండాలి? అందరూ తప్పక తెలుసుకోవాల్సిన మేటర్!

Buy Property With Legal Documents: మీరు మంచి ఇల్లు లేదా ప్లాట్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా. అయితే భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండాలంటే ఈ స్టోరీ ఒకసారి చదవండి. ఎందుకంటే మనదేశంలో నేడు రియల్ ఎస్టేట్ రంగంలో విపరీతమైన లీగల్ ఇష్యూస్ వస్తున్నాయి. ఇలాంటి వాటి ఊబిలో చిక్కుకోకుంటే బయటపడటం అంత సులువు కాదు. అందుకే ఆస్తులు కొనుగోలు చేసేముందు అన్ని డాక్యుమెంట్లను కచ్చితంగా చెక్ చేయాలి. అందుకే ఆ లీగల్ డాక్యుమెంట్ల  గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. 
 

1 /7

పేమెంట్ రసీదులు:  ఆస్తులు కొనుగోలు చేసే ముందు మీరు చేసిన పేమెంట్స్ కు సంబంధించిన ఒరిజినల్ రసీదులను కచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే బ్యాంక్ లోన్ తీసుకునేటప్పుడు వీటన్నింటినీ మీరు బ్యాంకుకు చూపించాల్సి ఉంటుంది. 

2 /7

బిల్డింగ్ ప్లాన్ కాపీ  మీరు ఫ్లాట్ కొనుగోలు చేస్తే దానికి సంబంధించి అథారిటీ నుంచి ఆమోదం పొందిన బిల్డింగ్ ప్లాన్ కాపీని కచ్చితంగా తీసుకోవాలి. దీని వల్ల సదరు బిల్డింగ్ ను ప్లాన్ ప్రకారం సరిగ్గా కట్టారా లేదా అనేది తెలిసిపోతుంది.   

3 /7

 మ్యూటేషన్ రిజిస్టర్  మీరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఉన్న ప్రాపర్టీని కొనాలనుకుంటే కచ్చితంగా మ్యూటేషన్స్ చేసుకోవాలి. దీని వల్ల సదరు ఆస్తిపై పూర్వం ఎవరికి యాజమాన్య హక్కులు ఉన్నాయనేది తెలుస్తుంది. దీంతో భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. 

4 /7

ఖాతా సర్టిఫికేట్  దీన్ని ఎక్ట్రాక్స్ట్ అంటారు. ఆయా రాష్ట్రాలను బట్టి దీని పేరు మారుతుంది. ఈ అకౌంట్ సర్టిఫికేట్ అనేది ఆస్తి యాజమాన్యం, చట్టపరమైన స్థితి ధ్రువీకరించే ఒక చట్టపరమైన డాక్యుమెంట్. మీ భవిష్యత్తులో సదరు ప్రాపర్టీని అమ్మాలనుకుంటే ఈ అకౌంట్ సర్టిఫికేట్ కచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది.   

5 /7

పొజిషన్ లెటర్  ఇండియాలో ప్రాపర్టీ కొనేటప్పుడు కచ్చితంగా డెవలపర్ నుంచి పొజిషన్ లెటర్ తీసుకోవాలి. దీనిలో డెవలపర్ మీ ప్రాపర్టీ ఏ తేదీ లోపు స్వాధీనం చేస్తారో వివరంగా ఉంటుంది. మీరు బ్యాంకు లోన్ కోసం వెళ్లాలనుకుంటే ఈ పొజిషన్ లెటర్ కచ్చితంగా అవసరం ఉంటుంది. 

6 /7

అలాట్ మెంట్ లెటర్  డెవలపర్ లేదా హౌసింగ్ బోర్డు అనేది బయ్యర్లకు అలాట్ మెంట్ లెటర్ ఇస్తారు. దీనిలో ప్రాపర్టీ వివరాలు, బయ్యర్ చెల్లించిన డబ్బుల వివరాలన్నీ ఉంటాయి. సేల్ అగ్రిమెంట్ వేరు..అలాట్ మెంట్ లెటర్ వేరు. సేల్ అగ్రిమెంట్ స్టాంప్ పేపర్ మీద రాస్తారు. అలాట్ మెంట్ లెటర్ అనేది సదరు అథారిటీ లెటర్ హెడ్ తో ఉంటుంది.   

7 /7

మీరు ప్రాపర్టీ కొనుగోలు చేసే ముందు కచ్చితంగా సేల్ అగ్రిమెంట్ రాసుకోవాలి. దీనిలో మీ పేమెంట్ ప్లాన్, ఆస్తి బదలాయింపు , ఆస్తికి సంబంధించిన అన్ని వివరాలు ఉండేలా చూసుకోవాలి. కాబట్టి డెవలపర్ నుంచి ప్రాపర్టీ కొనుగోలు చేసినట్లయితే నిర్మాణం ఎంత కాలంలో పూర్తి అవుతుంది. కామన్ ఏరియా వివరాలు, కల్పించే సౌకర్యాలు, సాధారణ నియమ, నిబంధనలు అన్ని ఆ అగ్రిమెంట్లో ఉండే విధంగా చూసుకోవాలి.