Dhanteras Gold: దంతేరస్ రోజు 2 నిమిషాల్లో డిజిటల్ గోల్డ్ కొనే సులభమైన మార్గాలు ఇవే
Dhanteras Gold: దంతేరస్ సమీపిస్తోంది. ఆ రోజు బంగారం కొనేందుకు ఆలోచిస్తున్నారా..ఎక్కడికీ వెళ్లకుండా సులభంగా ఆన్లైన్లో నాణ్యమైన బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. ఎలాగో తెలుసుకుందాం.
ఇటీవలి కాలంలో డిజిటల్ గోల్డ్‌కు ఆదరణ ఎక్కువైంది. ఇంట్లో కూర్చుని ఆన్‌లైన్ విధానంలో సులభంగా రూపాయి నుంచి మొదలుకుని ఎంతైనా కొనుగోలు చేయవచ్చు. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యూపీఐలు ఇందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆ వివరాలు మీ కోసం..
దీపావళికి రెండ్రోజుల ముందు వచ్చేది దంతేరస్ పండుగ. ఈ ఏడాది దంతేరస్ అక్టోబర్ 22న ఉంది. ఆ రోజు బంగారం కొనడం శుభసూచకంగా భావిస్తారు. మరి మీరు కూడా బంగారం కొనాలనుకుంటే...డిజిటల్ బంగారం కొనుగోలు మంచి ప్రత్యామ్నాయంగా ఉంది. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి ఆన్‌లైన్ వేదికల ద్వారా డిజిటల్ గోల్డ్ కావల్సినంత కొనవచ్చు. చాలా సులభంగా, రూపాయి నుంచి ప్రారంభించవచ్చు.
డిజిటల్ గోల్డ్ కొనుగోలులో లాభాలు కూడా ఉన్నాయి. నాణ్యత పక్కాగా ఉండటమే కాకుండా సురక్షితమైన విధానం కూడా. మీరు కొనే డిజిటల్ గోల్డ్‌ను సురక్షితంగా అదే వేదికపై భద్రపర్చుకోవచ్చు. అదే సమయంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మేయవచ్చు కూడా. బయట బంగారం కొనేటప్పుడు మేకింగ్ చార్జెస్, ఇతర ఛార్జీలు చాలానే ఉంటాయి. డిజిటల్ గోల్డ్ విషయంలో ఇవేమీ ఉండవు. మార్కెట్‌లో గోల్డ్ ధర ఎంత ఉంటే అదే ధరకు క్షణాల్లో విక్రయించవచ్చు.
గూగుల్ పే ద్వారా
ముందు గూగుల్ పే ఓపెన్ చేసి న్యూ ట్యాప్ క్లిక్ చేయండి. సెర్చ్ బార్‌లో గోల్డ్ లాకర్ టైప్ చేసి ఓపెన్ చేశాక...పర్చేజ్ గోల్డ్ ఆప్షన్ ఎంచుకోండి. పర్చేజ్ ప్రారంభించిన తరువాత 5 నిమిషాల వరకే లాకింగ్ పీరియడ్ ఉంటుంది. 5 నిమిషాల తరువాత ధరలో మార్పు రావచ్చు.
మీరు ఎంత బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారో ఆ మొత్తాన్ని నమోదు చేయాలి. ఒక రూపాయి నుంచి రోజుకు 50 వేల రూపాయలవరకూ పెట్టుబడి పెట్టవచ్చు. చెక్ మార్క్ ట్యాప్ చేసి చెల్లింపు విధానాన్ని ఎంచుకోవాలి. ఆ వివరాలు నమోదు చేశాక చెల్లింపు పూర్తవుతుంది. క్షణాల్లో మీ లాకర్‌లో మీరు కొన్న బంగారం వివరాలు కన్పిస్తాయి.
పేటీఎం ద్వారా
పేటీఎం యాప్ ఓపెన్ చేసి ఆల్ సర్వీసెస్ సెక్షన్‌లో వెళ్లాలి. లేదా సెర్చ్ బార్‌లో గోల్డ్ టైప్ చేస్తే సంబంధిత విండో ఓపెన్ అవుతుంది. ఇందులో కూడా పర్చేజ్ గోల్డ్ ఆప్షన్ ఎంచుకుని..ఎంత గోల్డ్ కొనాలో ఆ మొత్తం ఎంటర్ చేస్తే...వివరాలు కన్పిస్తాయి. తరువాత పేమెంట్ పూర్తి చేస్తే..మీ లాకర్‌లో కొన్న బంగారం వివరాలు ప్రత్యక్షమౌతాయి.
ఫోన్ పేలో కూడా ఈ సౌలభ్యం ఉంది. ఎందులో కొనుగోలు చేసినా...మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్కెట్ ధర ప్రకారం క్షణాల్లో విక్రయించుకోవచ్చు. అప్పటి వరకూ మీ గోల్డ్ భద్రంగా మీ డిజిటల్ లాకర్‌లో ఉంటుంది.
Also read: Banks Interest Rates: దీపావళికి ముందు బ్యాంకుల షాక్, రుణాలపై వడ్డీ రేటు పెంపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook