Banks Interest Rates: దీపావళికి ముందు బ్యాంకుల షాక్, రుణాలపై వడ్డీ రేటు పెంపు

Banks Interest Rates: దీపావళికి ముందే బ్యాంకులు సగటు కస్టమర్‌కు షాక్ ఇచ్చాయి. ఎస్బీఐ సహా ఇతర బ్యాంకులు రుణాల వడ్డీ రేట్లను పెంచేశాయి. కొత్త వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 17, 2022, 11:42 PM IST
Banks Interest Rates: దీపావళికి ముందు బ్యాంకుల షాక్, రుణాలపై వడ్డీ రేటు పెంపు

ఇటీవలి కాలంలో బ్యాంకు రుణాలపై వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ రెపో రేటు పెంచడంతో..బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతూ పోతున్నాయి. ఇప్పుడు మరోసారి బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచాయి. ఏ బ్యాంకు ఏ మేరకు పెంచిందో చూద్దాం..

ప్రభుత్వ రంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా ప్రైవేట్ రంగంలోని కోటక్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. బ్యాంకుల ఈ నిర్ణయంతో పర్సనల్ లోన్, హోమ్ లోన్, వెహికల్ లోన్ వడ్డీ మరింత ప్రియం కానుంది. ఎస్బీఐ ఏడాది వ్యవధి కలిగిన ఎంసీఎల్ఆర్‌ను 0.25 శాతం మేర పెంచి..7.95 శాతం చేసింది. కొత్త వడ్డీ రేట్లు అక్టోబర్ 15 నుంచి అమల్లో వచ్చేశాయి. మరోవైపు 2, 3 ఏళ్ల కాల వ్యవధి ఉన్న ఎంసీఎల్ఆర్‌ను కూడా పెంచింది. 2 ఏళ్ల వ్యవధి కలిగిన ఎంసీఎల్ఆర్‌పై 8.15శాతం, 3 ఏళ్ల ఎంసీఎల్ఆర్‌పై 8.25 శాతం చేసింది. 

ఇక కోటక్ మహీంద్ర బ్యాంకు కూడా వివిధ కాల పరిమితి కలిగిన ఎంసీఎల్ఆర్‌లపై వడ్డీ రేటును 7.70 నుంచి 8.95 శాతం చేసింది. అటు ఏడాది కాల వ్యవధి కలిగిన రుణాలపై బ్యాంకు వడ్డీని 8.75 శాతం చేసింది. మరోవైపు ఫెడరల్ బ్యాంకు కూడా రుణాలపై వడ్డీ రేటును పెంచింది. ఏడాది కాల పరిమితి కలిగిన ఎంసీఎల్ఆర్‌ను అక్టోబర్ 16 నుంచి 8.70 శాతం చేసింది. 

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత నెలలో రెపో రేటును 0.50 శాతం పెంచడంతో వివిధ బ్యాంకులు కూడా వడ్డీరేట్లను పెంచడం అనివార్యమైందని తెలుస్తోంది. 

Also read: 7th Pay Commission: భారీగా పెరిగిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం, ఐదేళ్ల ఎరియర్లు కూడా, దీపావళి కానుక

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News