UPI Payment Limit: నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా..బ్యాంకుల సౌకర్యార్ధం యూపీఐ చెల్లింపుల పరిమితిపై మినహాయింపు ఇచ్చింది. ఈ పరిమితి బ్యాంకుని బట్టి వేర్వేరుగా ఉంటుంది. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యూపీఐ పేమెంట్లకు విశేష ఆదరణ లభిస్తోంది. రోజుకు 20 కోట్ల కంటే ఎక్కువే యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయి. అయితే యూపీఐ చెల్లింపులకు సంబంధించి ఒక పరిమితి ఉంటుంది. ఆ పరిమితి ఎంతనేది ఇప్పుడు తెలుసుకుందాం..


ప్రస్తుతం యూపీఐ చెల్లింపులనేవి అత్యంత సులభమైన, అత్యంత ప్రజాదరణ, ప్రాచుర్యం కలిగిన విధానాలుగా ఉన్నాయి. కేవలం సెకన్ల వ్యవధిలో ఎవరికైనా డబ్బులు పంపించవచ్చు లేదా పంపించమని రిక్వస్ట్ చేయవచ్చు. రోజుకు 20 కోట్లకు పైగా చెల్లింపులు జరుగుతున్నాయంటే..యూపీఐ చెల్లింపులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.


భీమ్ యూపీఐ పరిమితి


నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌పై ఉన్న సమాచారం మేరకు యూపీఐ ద్వారా ఒకసారి అత్యధికంగా 2 లక్షల వరకూ లావాదేవీలు జరపవచ్చు.  ఒకవేళ ఎవరైనా యూజర్ భీమ్ యూపీఐ వినియోగిస్తే..అత్యధికంగా ఒక లావాదేవీలో లక్ష రూపాయయలు పంపించవచ్చు. ఎన్‌పీసీఐ వెబ్‌సైట్ సమాచారం మేరకు బ్యాంకు ఖాతా నుంచి ఒకరోజు పరిమితి ఒక లక్ష రూపాయలే.


రోజుకు పది లావాదేవీలు


దేశంలోని అతిపెద్ద ప్రైవేటు బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సి వెబ్‌సైట్ సమాచారం మేరకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ యూపీఐ ద్వారా ఒక రోజుకు పది లావాదేవీలకు అనుమతి ఉంటుంది. మొత్తం విలువ లక్ష రూపాయలు దాటకూడదు. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అన్ని బ్యాంకులకు తమ సౌకర్యార్ధం యూపీఐ చెల్లింపుల పరిమితి విధించుకునే మినహాయింపు కల్పించింది. బ్యాంకుల్ని బట్టి ఈ పరిమితి మారుతుంది. యూపీఐ పేమెంట్ పరిమితి మూడు రకాలుగా ఉంటుంది. మొదటిది రోజులో అత్యధిక లావాదేవీల విలువ, రెండవది ఒకసారి లావాదేవీలో అత్యధిక పరిమితి, మూడవది రోజుకు ఎన్ని లావాదేవీలనేది. 


Also read: Banking System: కస్టమర్ ఫ్రెండ్లీగా బ్యాంకులు, ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సి కస్టమర్లకు శుభవార్త



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook