Dil Raju on F3 movie tickets price : `టికెట్ల రేట్ల పెంపు అందుకే.. ఈ సారి...`
Dil Raju on F3 movie tickets rates : టికెట్ రేట్లు తగ్గిస్తూ మొదట ఒక అడుగు వేస్తున్నామని.. సక్సెస్ అయితే అంతా ఇదే ఫాలో అవుతారని అన్నారు.
Dil Raju on F3 movie tickets price : వెంకటేష్, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి, దిల్ రాజు కాంబినేషన్‌లో రాబోతున్న భారీ మల్టీస్టారర్ మూవీ 'ఎఫ్ 3'. డబుల్ బ్లాక్‌బస్టర్ 'F2' ఫ్రాంచైజీ నుంచి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించిన ఫ్యామిలీ అండ్ ఫన్ ఎంటర్‌టైనర్ 'ఎఫ్3'. ఈ మూవీ కోసం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మే 27న ఎఫ్3 ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదలకు సిద్ధమైంది.
ఎఫ్2 విడుదలకు ముందే దర్శకుడు అనిల్ రావిపూడికి ఎఫ్3 చేయాలనే థాట్ వచ్చిందన్నారు దిల్ రాజు. అనుకున్నట్లే ఎఫ్2 పెద్ద విజయం సాధించిందని, 'సరిలేరు నీకెవ్వరు' తర్వాత స్క్రిప్ట్ పనులు పూర్తి చేసి సెట్స్ పైకి వెళ్లామని అన్నారు. ఎఫ్3 కథ చెప్పినపుడు ఎంత నవ్వుకున్నానో సినిమా చూసిన తర్వాత దానికి మించిన నవ్వుకున్నానని.. ఎఫ్3 కంప్లీట్ ఫన్ అందించే నాన్ స్టాప్ ఎంటర్‌టైనర్ అని దిల్ రాజు అన్నారు. ఎఫ్2లో ప్రేమ,పెళ్లి.. అందులో ఉన్న ఫ్రస్ట్రేషన్ హిలేరియస్‌గా చూపించి.. చివరికి భార్యల పాయింట్ ఆఫ్ వ్యూను కూడా చూడాలని చెప్పి.. అందరికీ నచ్చేలా చేశామన్నారు. ఎఫ్3 పంచభూతాలతో పాటు డబ్బు అనే ఆరో భూతం కూడా మనిషి బ్రతకడానికి అంతే అవసరమని, అన్నీ డబ్బుతోనే ముడిపడి ఉంటాయి కాబట్టి.. ఆ డబ్బు చుట్టూ తిరిగే కథే ఎఫ్3 అని దిల్‌రాజు అన్నారు. దర్శకుడు అనిల్ కథకంటే కథనంపై ఎక్కువ దృష్టి పెడతాడని దిల్ రాజు ప్రశంసించారు. F3 సినిమా చూసి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నానని దిల్‌రాజు తెలిపారు. సినిమా రన్ టైం 2గంటల 28నిమిషాలని.. 90 నిమిషాలు ప్రేక్షకులు నాన్ స్టాప్‌గా నవ్వుతూనే ఉంటారని చెప్పారు.
కరోనా పాండెమిక్ తర్వాత పరిశ్రమలో చాలా మార్పులొచ్చాయని.. సినిమాలు ఆగిపోయి బడ్జెట్ పెరిగిందని.. ఆడియన్స్ ఓటీటీల్లో సినిమాలు చూడటానికి అలవాటు పడ్డారని దిల్ రాజు అన్నారు. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2 లాంటి భారీ బడ్జెట్ సినిమాలకు రేట్లు పెంచి రికవరీ చేయడానికి ప్రయత్నాలు చేసి.. మంచి ఫలితాలు సాధించామన్నారాయన. అయితే దీని వల్ల ప్రేక్షకులు థియేటర్‌కి దూరమౌతున్నారని అర్థమైందన్నారు. రిపీట్ ఆడియన్స్ కూడా విపరీతంగా తగ్గిపోయారని దిల్ రాజు పేర్కొన్నారు. ముఖ్యంగా మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఆడియన్స్ థియేటర్‌కు రావడం తగ్గిపోయిందన్నారు. టికెట్ల ధరలు వారికి అందుబాటులో లేకపోవడమే కారణమన్నారు. ఎఫ్3 అన్ని వర్గాల ప్రేక్షకులు, ఫ్యామిలీ కలిసి చూడాల్సిన సినిమా కాబట్టే ధరలు అందరికీ అందుబాటులో ఉండాలని.. పాత జీవో ప్రకారం ఉన్న ధరలకే టికెట్ల రేట్లను తగ్గించామని దిల్ రాజు అన్నారు. ఓటీటీలకు అలవాటు పడిన ప్రేక్షకులను కూడా థియేటర్‌కు రప్పించాలనే ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఎఫ్3కి తప్పకుండా రిపీట్ ఆడియన్స్ వస్తారని ధీమా వ్యక్తం చేశారు.
ఎఫ్3 సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలనే అలోచన చేయలేదన్నారు దిల్ రాజు. ఇప్పుడంతా లార్జన్ దాన్ లైఫ్ సినిమాలు గురించే మాట్లాడుకుంటున్నారని.. మార్వెల్, అవతార్ లాంటి సినిమాలే నిలబడుతున్నాయని అన్నారు. తెలుగులో బాహుబలి, ఆర్.ఆర్.ఆర్.తో రాజమౌళి ఈ తరహా సినిమాలకు శ్రీకారం చుట్టారని అన్నారు. రెండేళ్ళలో ఒకటి, రెండు ఈ తరహా పెద్ద సినిమాలు తమ బ్యానర్ నుండి ప్రకటించే అవకాశం ఉందని దిల్ రాజు తెలిపారు.
రేట్లు పెంచానని తనను అంతా విమర్శించారని... నైజాంలో దిల్ రాజు రిలీజ్ చేశాడు కాబట్టి ఆయనే పెంచేశాడని సులువుగా అనేస్తారని... తెరవెనుక నిర్మాతలు, హీరోలు, ఇతరత్రా బోలెడు లెక్కలుంటాయని దిల్ రాజు అన్నారు. ఏదేమైనా టికెట్ రేట్లు తగ్గిస్తూ మొదట ఒక అడుగు వేస్తున్నామని.. సక్సెస్ అయితే అంతా ఇదే ఫాలో అవుతారని అన్నారు. ప్రసాద్, జీఎంబీ లాంటి ప్రైమ్ మల్టీ ప్లెక్స్ 250 ప్లస్ జీఎస్టీ.. మిగతావి జీఎస్టీ కలుపుతూ 250. హైదరాబాద్ లో సింగల్ స్క్రీన్స్ అన్నీ 150ప్లస్ జీఎస్టీ.. జిల్లాల్లో జీఎస్టీ కలుపుతూ 150 వరకు ధర ఉంటుందన్నారు. 250లో నిర్మాతకు వచ్చేది 125 రూపాయిలేనని అన్నారు.
నైజాం మొత్తం దిల్‌రాజు కంట్రోల్‌లో పెట్టుకున్నాడనేది అపోహ మాత్రమేనని.. అలా ఏమీ ఉండదని.. మిగతా వాళ్ళు మాకు అడ్వాన్సుగా రూపాయి ఇస్తే.. సినిమా అయిపోయిన రెండు మూడు వారాల్లోనే వారి ఖాతా సెటిల్ చేసుకొని వెళ్ళిపోతారని, అందుకే మాట వింటారని అన్నారు. ఎక్కువ సినిమాలు చేయడం వలన ఆటోమేటిగ్గా తమపై నమ్మకం ఉంచి ప్రాధాన్యతనస్తారని దిల్ రాజు అన్నారు. ఈ రెండు కారణాల వల్ల మేము నెంబర్ వన్‌గా ఉన్నాం తప్ప.. ఇంకేదో విధంగా కంట్రోల్ చేసి కాదని దిల్ రాజు స్పష్టం చేశారు. ఓటీటీలు పెద్ద సినిమాలకు ముందస్తు ఛార్జీలు వసూళ్లు మొదలుపెట్టటం అంటే.. వాళ్ళు ప్రేక్షకులు ఇలా అయితే చూస్తారా లేదా అని టెస్ట్ చేసుకుంటున్నారని దిల్ రాజు అభిప్రాయ పడ్డారు.
ఎఫ్3 అంటే ఫన్, ఫస్ట్రేషన్.. (బీకాజ్ ఆఫ్) ఫైనాన్స్ అని.. ఎఫ్4 గురించి దర్శకుడు అనిల్ మంచి ఐడియా చెప్పాడని.. F4 కూడా ఉంటుందని దిల్ రాజు తెలిపారు. ఎఫ్ 3లో ఒకట్రెండు చోట్ల ఎఫ్2 గుర్తుకు వస్తుంది తప్ప.. మిగతా అంతా ఫ్రెష్‌గా ఉంటుందన్నారు. వెంకటేష్‌కు రేచీకటి, వరుణ్‌కు నత్తి ఇలా అన్నీ కొత్త ఎలిమెంట్స్ హిలేరియస్‌గా చేర్చాడన్నారు. వెంకటేష్ గారికి 'కలియుగ పాండవులు' సమయంలోనే అభిమానినని... వారం రోజులు ముందుగా టికెట్ బుక్ చేసుకొని సుదర్శన్‌లో చూశానని దిల్ రాజు చెప్పుకొచ్చారు. నువ్వు నాకు నచ్చావ్ సినిమా నైజాంలో విడుదల చేసినప్పుడు ఆయనతో యాక్సెస్ పెరిగిందని.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో మొదటిసారి కలిసి పని చేశామని అన్నారు. వెంకటేష్ గారు ఒక ప్రొడక్షన్ హౌస్ నుండి వచ్చిన హీరో కాబట్టి నిర్మాత కోసం ఎక్కువ ఆలోచిస్తారన్నారు. లొకేషన్‌లో ఏదైనా వృధా అవుతుంటే ఆయన తట్టుకోలేరని.. అది రామానాయుడు గారు ఆయనకు నేర్పించిన గొప్ప లక్షణమన్నారు.
Also Read - Nikhat Zareen: వుమెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌గా తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్...
Also Read - Aishwarya Rai Bachchan Cannes 2022: కేన్స్‌లో ఐశ్వర్య రాయ్.. క్వీన్ ఆఫ్ కేన్స్ పైనే అందరి కళ్లు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook