SBI Alert: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. ఆ మెసేజ్‌లపై క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ..!
SBI Alert: మీరు ఎస్బీఐ ఖాతాదారా? అయితే జాగ్రత్త. సైబర్ నెరగాళ్లు మీకు నకిలీ సందేశాలు పంపి ఖాతాల ఖాళీ చేయొచ్చు. అలాంటివి జరగకుండా ఎలా జాగ్రత్త పడాలో ఇప్పుడో తేలుసుకోండి.
SBI Alert: మీకు ఎస్బీఐలో ఖాతా ఉందా? అయితే మీరు అప్రమత్తంగా ఉండాలి. సైబర్ నెరగాళ్లు ఎస్బీఐ ఖాతాదారులను టార్గెట్ చేసి.. ఆర్థిక నేరాలకు (Cyber Attacks on SBI customers) పాల్పడుతున్నారు. కొత్త కొత్త పద్ధతుల్లో ఈ నేరాలు చస్తున్నారు.
ఇటీవలి కాలంలో ఎక్కువగా జరుగుతున్న మోసాల గురించి తాజాగా అలర్చ్ ఇచ్చింది ఎస్బీఐ.
మీ కేవైసీ ఎక్స్పైర్ అయిందని, డాక్యుమెంట్స్ ఎక్స్పైర్ అయ్యాయని మెసేజ్‌లు పంపి.. వాటిని వెంటనే అప్డేట్ చేసుకోవాలని అచ్చం నిజమైన బ్యాంక్ నుంచి వచ్చినట్లుగానే సైబర్ నేరగాళ్లు ఖాతాదారులకు మెసేజ్‌లు (SBI warns customers) పంపిస్తున్నారు.
ఆ మెసేజ్‌లు నిజమని నమ్మి ఆయా సందేశాల్లో ఉన్న లింక్‌లపై క్లిక్ చేస్తే అకౌంట్లో డబ్బులు కొల్లగొడుతున్నారు. చాలా మంది ఇలాంటి నకిలీ సందేశాలను గుర్తించడంలో గందరగోళం ఎదుర్కొంటున్నారు.
అలాంటి వారి కోసం 'పీఐబీ ఫ్యాక్ట్స్ చెక్'.. కీలక సూచనలు చేసింది. నకిలీ సందేశాలను సులంభంగా గుర్తించేలా పలు వివరాలను (PIB facts check on SBI Documents Updation) తెలిపింది.
నకీలీ సందేశాలను గుర్తించడం ఎలాగంటే..
ఎస్బీఐ పేరుతో.. మీ ఖాతా బ్లాక్ అయిందని వచ్చిన సందేశాలన్ని నకిలీవేనని పీఐబీ ఫ్యాక్ట్స్ చెక్ స్పష్టం (SBI Alert on fake KYC) చేసింది.
దీనితో పాటు మీ వ్యక్తిగత, బ్యాంక్ ఖాతా సంబంధిత వివరాలు సమర్పించమని వచ్చే సందేశాలు కూడా నకిలీవేనని తెలిపింది. బ్యాంక్ ఎప్పుడు కూడా ఇలాంటి వివరాలను కోరదని వివరించింది. అలాంటి సందేశాలకు అస్సలు స్పందించకూడదని (PIB Fact Check on Bank Frauds) హెచ్చరించింది.
అలాంటి సందేశాలు వచ్చినప్పుడు ఎస్బీఐ ఖాతాదారులు report.phishing@sbi.co.inకు ఫిర్యాదు చేయాలని సూచించింది.
Also read: Low Investment Business Ideas: ఈ బిజినెస్‌లకు తిరుగులేదు.. తక్కువ పెట్టుబడి.. మంచి లాభాలు!!
Also read: Todays Gold Rate: భారీగా తగ్గిన బంగారం ధర, దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook