Elon Musk: అంబానీ అయితే నాకేంటి.. అదానీ అయితే నాకేంటి? మస్క్ తమ్ముడు ఇక్కడ.. సంపాదన ఎంతో తెలుసా?
Elon Musk: ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ సంపద రోజురోజుకు పెరుగుతుంది. ఇప్పటి వరకు 245 డాలర్ల బిలియన్లు పెరిగింది. ఎలోన్ మస్క్ ఈ ఏడాది సంపాదించిన మొత్తం భారత్ లో అత్యంత ధనవంతులైన ఇద్దరు వ్యాపారవేత్తలు ముఖేశ్ అంబానీ, గౌతమ్ అదానీల సంపదకు దాదాపు ఒకటిన్నర రెట్లు అని తెలిస్తే మీరు షాక్ అవుతారు. అవును ఎలన్ మస్క్ అదానీ, అంబానీలను పక్కకు నెట్టారు. ఎలన్ మస్క్ సంపద భారీగా పెరగడానికి గల కారణాలు తెలుసుకుందాం.
Elon Musk: ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యాపారవేత్త ఎలోన్ మస్క్ సంపదకు రెక్కలు వచ్చాయి. పగలు రెట్టింపు, రాత్రి నాలుగింతలు అనే నానుడి సత్యాన్ని నిరూపిస్తూ అతని సంపద నిరంతరం పెరుగుతూనే ఉంది. ఇటీవల, మస్క్ మొత్తం నికర విలువ 400 బిలియన్ డాలర్లు దాటి రికార్డు సృష్టించింది. ఇప్పుడు అతని నికర విలువ త్వరలో 500 బిలియన్ డాలర్లను దాటుతుందని తెలుస్తోంది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, అతని మొత్తం సంపద $474 బిలియన్లకు చేరుకుంది.
ఎలోన్ మస్క్ సంపద ఇప్పటివరకు $245 బిలియన్లు పెరిగింది. ఎలోన్ మస్క్ ఈ ఏడాది మాత్రమే సంపాదించిన మొత్తం ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీల సంపదకు దాదాపు ఒకటిన్నర రెట్లు అని తెలిస్తే మీరు షాక్ అవుతారు. గత కొన్ని నెలల్లో అంబానీ, అదానీల భారీగా తగ్గిపోయింది. ఇద్దరి నికర విలువ 100 బిలియన్ డాలర్ల దిగువకు పడిపోయినట్లు పలు రిపోర్టులు వెల్లడించాయి.
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, ప్రపంచ బిలియనీర్ల జాబితాలో, ముఖేష్ అంబానీ $96.3 బిలియన్ల సంపదతో 17వ స్థానంలో ఉన్నారు. మరోవైపు గౌతమ్ అదానీ 80.8 బిలియన్ డాలర్ల ఆస్తులతో 19వ స్థానంలో ఉన్నారు. ఈ ఏడాది ముఖేష్ అంబానీ సంపద 55.5 మిలియన్ డాలర్లు తగ్గింది. మరోవైపు గౌతమ్ అదానీ సంపద ఈ ఏడాది 3.52 బిలియన్ డాలర్లు తగ్గింది. 2024లో ఎలోన్ మస్క్ సంపాదన.. ఈ ఏడాది ఇప్పటివరకు అతని సంపద $245 బిలియన్లు పెరిగింది. ఇది అంబానీ, అదానీల సంపద $177.1 బిలియన్లకు దాదాపు ఒకటిన్నర రెట్లు ఎక్కువ.
కాగా ముఖేశ్ అంబానీ నికర సంపద విలువ ఆయన రెండవ కుమారుడు అనంత్ పెళ్లి సమయానికి అంటే 2024 జులై 120.8 బిలియన్ డాలర్లు ఉంది. బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 13 నాటికి ఈ విలువ 96.7 బిలియన్ డాలర్లకు పరిమితం అయ్యింది.
ఇక గౌతమ్ అదానీ నికర ఆదాయం ఈ ఏడాది జూన్ లో 122.3 బిలియన్ డాలర్లుగా ఉంది. డిసెంబర్ కల్లా 82.1బిలియన్ డాలర్లకు పరిమితమైంది. వరుస ఆరోపణలు, దర్యాప్తులు కాస్తా అదానీ గ్రూప్ షేర్లపై పెట్టుబడుదారుల విశ్వాసాన్ని దెబ్బతీసాయి. గతేడాది హిండెన్ బర్గ్ రిపోర్టు నుంచి కోలుకుంటున్న అదానీ గ్రూప్ పై గతనెలలో అమెరికా న్యాయశాఖ లంచం ఆరోపణలు చేయడంతో మళ్లీ దెబ్బతీసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe