Higher Pension Updates: ఈపీఎఫ్ఓ చందాదారులకు ముఖమైన గమనిక. అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే మరో అవకాశం కల్పిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇవాళ్టితో ముగియాల్సిన గడువు తేదీని మరోసారి పెంచుతూ ఈపీఎఫ్ఓ నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ పధకంలో ఎక్కువ పెన్షన్ పొందాలంటే ఉద్యోగులు విడిగా దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు గడువు తేదీ వాస్తవానికి జూన్ 26 అంటే ఇవాళే చివరి రోజు. గతంలో అంటే 2022 నవంబర్ 4వ తేదీన సుప్రీంకోర్టు అధిక పెన్షన్ విషయంలో స్పష్టమైన ఆదేశాలిచ్చింది. పెన్షన్ పధకంలో ఎంప్లాయర్ వాటా ఎక్కువ ఉండేలా సంబంధిత ఉద్యోగి ఎంపిక చేసుకోవడాన్ని అధిక పెన్షన్ ఆప్షన్ అంటారు. గతంలో అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు మే 3 చివరి తేదీగా ఉంటే జూన్ 26 అంటే ఇవాళ్టి వరకూ పొడిగించారు. ఆ తరువాత మళ్లీ ఇప్పుడు జూలై 11 వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తోంది. 


ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసే సమయంలో ఎదురైన టెక్నికల్ సమస్యలు, ఈపీఎఫ్ఓ సర్వర్ మొరాయింపు వంటి కారణాలతో అధిక పెన్షన్ కోరుకున్న ఉద్యోగులు దరఖాస్తు చేసుకోలేకపోయారు. అందుకే ఇవాళ్టి వరకూ ఉన్న గడువును మరోసారి అంటే జూలై 11 వరకూ పొడిగించారు. ఉద్యోగుల పెన్షన్ పథకం 1995 చట్టస సవరణ కంటే ముందు ఈపీఎఫ్ఓ చందాదారులై ఉండి ఈపీఎఫ్ చందా చెల్లిస్తూ ఉమ్మడి ఆప్షన్ ఇవ్వలేకపోయినవారికి ఎంప్లాయర్‌తో కలిసి ఆప్షన్ ఇచ్చేందుకు అవకాశముంటుంది. 


అధిక పెన్షన్ కోసం అప్లై చేసుకోవాలంటే ముందుగా ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్‌‌సైట్ ఓపెన్ చేయాలి. ఈపీఎఫ్ఓ పోర్టల్‌లో దీనికోసం ప్రత్యేక లింక్ ఉంటుంది. అప్లికేషన్ ఫర్ జాయింట్ ఆప్షన్ లింక్ క్లిక్ చేసి..ఈపీఎఫ్ చట్టం 11 ఆప్షన్ క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ యూనివర్శల్ ఎక్కౌంట్ నెంబర్‌తో వివరాలు పూర్తి చేయాలి. పుట్టిన తేదీ, ఆధార్ కార్డు వివరాలు నమోదు చేయడం తప్పనిసరి. ఆధార్ కార్డుతో లింక్ చేసిన మొబైల్ నెంబర్ వెరిఫై చేసుకోవాలి. ఇలా మొత్తం 4 దశల్లో ఉంటుంది. చివరికి ఓ నెంబర్ కేటాయిస్తారు. అంతే అధిక పెన్షన్ కోసం అప్లై చేసే ప్రక్రియ పూర్తయినట్టే.


ఈపీఎఫ్ఓ అధిక పెన్షన్ స్కీమ్ ప్రకారం ఒకవేళ ఉద్యోగి పదేళ్ల కంటే ఎక్కువ కాలం పనిచేసుంటే 58 ఏళ్ల తరువాత నెలవారీ పెన్షన్‌కు అర్హుడౌతాడు. నెలవారీ పెన్షన్ అనేది ఓ ఫార్ములా ప్రకారం లెక్కిస్తారు. పెన్షనబుల్ జీతాన్ని పెన్షనెబుల్ సర్వీస్‌తో గుణీకరించి 70తో భాగిస్తారు. 


Also read: Lulu Group: దేశంలో మరో పది వేల కోట్ల పెట్టుబడులు, 50 వేలమందికి ఉపాధి లక్ష్యం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook