EPF Balance: యూఏఎన్ నంబర్ లేకుండా ఈపీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవడం ఎలా?
EPF Balance: ఉద్యోగం చేసే వాళ్లలో ప్రతి ఒక్కరికి ఈపీఎఫ్ ఖాతా ఉంటుంది. అయితే ఇందులో ఎంత మొత్తం జమ అయ్యింది? అందులో ఉద్యోగి వాటా ఎంత? సంస్థ వాటా ఎంత అనే విషయాలు ఎలా తెలుసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం!
EPF Balance: సంగటిత రంగాల్లో పని చేసి ప్రతి ఉద్యోగికి ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) ఉంటుంది. రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక జీవనానికి అండగా ఉండటం కోసం ఈపీఎఫ్ తప్పనిసరి చేసింది ప్రభుత్వం.
ప్రతి నెల ఉద్యోగుల వేతనం నుంచి ఈపీఎఫ్‌లో కొంత మొత్తం జమ అవుతుంది. అంతే మొత్తాన్ని ఉద్యోగి సంస్థ కూడా జమ చేస్తుంది. ఈ మొత్తానికి ప్రతి ఏటా వడ్డీ కూడా చెల్లిస్తుంది ప్రభుత్వం.
ఉద్యోగులు తమ ఈపీఎఫ్ ఖాతాలో ఎంత డబ్బు ఉంది? అందులో తమ వాటా ఎంత? తమ సంస్థ ఎంత వాటా ఎంత? గత ఆర్థిక సంవత్సరానికి వడ్డీ ఎంత వచ్చింది అనే వివరాలు తెలుసునే వీలుంది.
ఇందుకోసం ఉద్యోగి సంస్థ ఏడది చివర్లో ఇచ్చే ఈపీఎఫ్ స్టేట్మెంట్ కోసం వేచి చూడాల్సిన పని లేదు. సొంతంగానే ఈపీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు తెలుసుకోవచ్చు.
ఈపీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకునేందుకు వివిధ మార్గాలు ఉన్నాయి. ఎస్ఎంఎస్ ద్వారా, మిస్ట్‌కాల్ ద్వారా, ఈపీఎఫ్ఓ పోర్టల్ ద్వారా, ఉమాంగ్ యాప్ ద్వారా సులభంగా ఈపీఎఫ్ బ్యాలెన్స్ వివరాలను పొందొచ్చు.
యూఏఎన్ నంబర్ లేకున్నా..
మీకు యూఏఎన్ నంబర్ గుర్తు లేకున్నా.. పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసకునే వీలుంది. ఇందుకోసం రెండు రకాల సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.
మొదటిది మిస్డ్ కాల్...
ఈపీఎఫ్ వద్ద రిజిస్ట్రర్ అయిన మొబైల్ నంబర్ నుంచి 011-22901406 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా మీ ఈపీఎఫ్ ఖాతాలో బ్యాలెన్స్ వివరాలను ఎస్ఎంఎస్ ద్వారా పొందొచ్చు. ఈ సదుపాయం ద్వారా ఖాతాలో ఎంత బ్యాలెన్స్ ఉందని మాత్రమ తెలుసుకునే వీలుంటుంది.
ఎస్ఎంఎస్ పంపడం ద్వారా..
7738299899 అనే ఫోన్ నంబర్‌కు మీ రిజిస్టర్ మొబైల్ నంబర్ ద్వారా EPFOHO UAN అనే మెసేజ్ పంపడం ద్వారా కూడా ఈపీఎఫ్ బ్యాలెన్స్‌ను ఎస్ఎంఎస్ ద్వారా పొందొచ్చు.
ఈ పద్దతిలో మరో సదుపాయం కూడా ఉంది. అదేమిటంటే.. బ్యాలెన్స్ వివరాలను ఇంగ్లీష్‌తో పాటు ఇతర భాషల్లోనూ పొందొచ్చు. ఉదాహరణకు తెలుగులో మీకు వివరాలు కావాలనుకుంటే.. EPFOHO UAN TEL అని టైప్ చేసి 7738299899కి ఎస్ఎంఎస్ పంపాలి. అలానే ఇతర ఏ భాష అయినా మొదటి మూడు అక్షరాలు టైప్ చేసి ఎంఎంఎస్ పంపడం ద్వారా బ్యాలెన్స్ వివరాలు సొంత బాషలో తెలుసుకునే వీలుంది.
అయితే పై రెండు పద్దతుల్లో ఈపీఎఫ్ఓ బ్యాలెన్స్ తెలుసుకునేందుకు ముందు ఓ ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ముందుగా మీ యూఏఎన్ నంబర్‌ను మీ సంస్థ యాక్టివేట్ చేసిందో లేదో తెలుసుకోవాలి. అప్పుడే ఈ సదుపాయాలు వాడుకోవచ్చు.
ఈపీఎఫ్ఓ పోర్టల్ ద్వారా..
ఈపీఎఫ్ అధికారిక పోర్టల్ ద్వారా కూడా బ్యాలెన్స్ చెక్ చేసుకునే వీలుంది. ఇందుకోసం ముందుగా.. ఈపీఎప్ పోర్టల్‌ను ఓపెన్ చేసి.. అందులో మెంబర్ పాస్‌బుక్‌లోకి లాగిన్ కావాలి.
ఇక్కడ మీ యూఏఎన్ ఐడీ, పాస్వర్డ్ అడుగుతుంది. వాటిని ఎంటర్ చేసి సెక్యూరిటీ క్వశ్చన్‌కు అన్సర్ టైప్ చేయాలి అప్పుడు లాగిన్ అవ్వొచ్చు.
ఇక్కడ మీ బ్యాలెన్స్ వివరాలు సమగ్రంగా తెలుసుకోవచ్చు. ఈపీఎఫ్ ఖాతా ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత మొత్తం జమ అయ్యింది? అందులో మీ వాటా ఎంత? మీ సంస్థ వాటా ఎంత అనే వివరాలతో పాటు.. ఆర్థిక సంవత్సరాల వారీగా వచ్చిన వడ్డీ వివరాలు ఉంటాయి.
ఉమాంగ్ యాప్ ద్వారా..
ఉమాంగ్ యాప్‌లో మీ యూఏఎన్ ద్వారా రిజిస్ట్రర్ చేసుకోవడం ద్వారా.. పాస్‌బుక్‌లోకి సులభంగా లాగిన్ కావచ్చు. ఇందులో కూడా సమగ్రంగా మీ ఖాతా వివరాలను చూడొచ్చు. అంతే కాకుండా అత్యవసరాలకు ఇక్కడి నుంచే నేరుగా ఈపీఎఫ్‌లో మీ వాటాలో కొంత మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునే వీలు కూడా ఉంది.
Also read: RBI Jobs: ఆర్బీఐలో భారీగా ఉద్యోగాలు- దరఖాస్తు, పరీక్ష తేదీలు ఇవే..!
Also read: Flipkart Quick Delivery: ఫ్లిప్‌కార్ట్ క్విక్ సర్వీస్.. ఇక 45 నిమిషాల్లోనే గ్రాసరీ డోర్ డెలివరీ..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook