Flipkart Quick Delivery: ఫ్లిప్‌కార్ట్ క్విక్ సర్వీస్‌.. ఇక 45 నిమిషాల్లోనే గ్రాసరీ డోర్ డెలివరీ..

Flipkart Quick Delivery Service: కస్టమర్లకు కేవలం 45 నిమిషాల్లోనే గ్రాసరీని డెలివరీ చేసేలా క్విక్ డెలివరీ సర్వీస్‌ను ఫ్లిప్‌కార్ట్ అందుబాటులోకి తీసుకొచ్చింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 18, 2022, 09:54 AM IST
  • ఫ్లిప్‌కార్ట్ క్విక్ డెలివరీ సర్వీస్.. ఇక 45 నిమిషాల్లోనే గ్రాసరీ డెలివరీ
  • ప్రస్తుతానికి బెంగళూరులో అందుబాటులోకి ఈ సర్వీస్
  • మున్ముందు మరిన్ని నగరాల్లో అందుబాటులోకి రానున్న సర్వీస్
 Flipkart Quick Delivery: ఫ్లిప్‌కార్ట్ క్విక్ సర్వీస్‌.. ఇక 45 నిమిషాల్లోనే గ్రాసరీ డోర్ డెలివరీ..

Flipkart Quick Delivery Service: ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఇకనుంచి 'ఫ్లిప్‌‌కార్ట్ క్విక్ డెలివరీ సర్వీస్‌' ద్వారా కేవలం 45 నిమిషాల్లోనే గ్రాసరీని డోర్ డెలివరీ చేయనుంది. ఇదివరకు 90 నిమిషాలుగా ఉన్న డెలివరీ సమయాన్ని 45 నిమిషాలకు కుదించింది. తద్వారా కస్టమర్లకు మరింత వేగంగా గ్రాసరీ డెలివరీ చేయనుంది. ప్రస్తుతానికి బెంగళూరులో ఈ సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకురాగా.. వచ్చే నెల నాటికి మరిన్ని నగరాల్లో అందుబాటులోకి రానుంది.

బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, డంజో వంటి ఈ కామర్స్ సంస్థలు కేవలం 15-20 నిమిషాల్లోనే కస్టమర్లకు గ్రాసరీ డెలివరీ చేసే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టిన తరుణంలో ఫ్లిప్‌కార్ట్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అయితే 10-20 నిమిషాల్లో డోర్ డెలివరీ అనేది సరైన మోడల్ కాదని ఫ్లిప్‌కార్ట్ భావిస్తోంది. అందుకే క్విక్ సర్వీస్‌ డెలివరీ టైమ్‌ని 45 నిమిషాలుగా నిర్ణయించింది.

ఫ్లిప్‌కార్ట్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి మాట్లాడుతూ.. కస్టమర్లకు నాణ్యమైన సేవలు అందించడమే తమ ఉద్దేశమని.. తద్వారా సుస్థిర బిజినెస్‌కు ఆస్కారం ఉంటుందని పేర్కొన్నారు. 45 నిమిషాల క్విక్ డెలివరీ సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నప్పటికీ.. 90 నిమిషాల డెలివరీ సర్వీస్ కూడా అందుబాటులో ఉండనుంది. ప్రస్తుతం 14 నగరాల్లో 90 నిమిషాల డెలివరీ సర్వీస్ అందుబాటులో ఉంది. 2022 చివరి నాటికి ఫ్లిప్‌కార్ట్ దీన్ని 200 నగరాలకు విస్తరించే ప్లాన్‌లో ఉంది. ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరులలో మాత్రమే అందుబాటులో ఉన్న ఫ్రెష్ వెజిటేబుల్, ఫ్రూట్స్ డోర్ డెలివరీ సర్వీస్‌ను కూడా మున్ముందు మరిన్ని నగరాలకు విస్తరించే యోచనలో ఉంది.

Also Read: Russia-Ukraine Conflict: ఉక్రెయిన్‌లో కాల్పుల మోత.. యుద్ధ సంకేతమేనా.. ఏం జరగబోతుంది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

 

Trending News