EPFO New Rules: కరోనా సమయం నుంచి ఇప్పటి వరకూ పీఎఫ్ ఎక్కౌంట్ నుంచి డబ్బులు విత్‌‌డ్రా చేసుకునే వెసులుబాటు ఉండేది. ఇప్పుడీ విషయంలో ఈపీఎఫ్ఓ కీలక ప్రకటన చేసింది. కోవిడ్ అడ్వాన్స్ రూపంలో పీఎఫ్ ఎక్కౌంట్ నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవడాన్ని నిలిపివేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పీఎఫ్ ఎక్కౌంట్ నుంచి అడ్వాన్స్ ఇక విత్‌డ్రా చేసుకోలేరు. ఈపీఎఫ్ఓ నిబంధనల్లో మార్పులు చేసింది. కోవిడ్ అడ్వాన్స్ విత్‌డ్రాను తక్షణం నిలిపివేస్తున్నట్టు ఈపీఎఫ్ ప్రకటించింది. కరోనా మహమ్మారి సమయంలో ఈపీఎఫ్ సభ్యులకు పీఎఫ్ డబ్బులు అడ్వాన్స్ తీసుకునే వెసులుబాటు ఉండేది. కరోనా ఫస్ట్ వేవ్ సయమంలో , ఆ తరువాత సెకండ్ వేవ్ సమయంలో అమలు చేశారు. జూన్ 12వ తేదీన ఈపీఎఫ్ఓ విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం కోవిడ్ మహమ్మారి ఇక లేనందున అడ్వాన్స్ విత్‌డ్రా కూడా నిలిపివేశారు. 


ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనలో భాగంగా పీఎఫ్ ఎక్కౌంట్ నుంచి అడ్వాన్స్ విత్‌డ్రా చేసుకోవడాన్ని 2020 మార్చ్‌లో ప్రకటించారు. కానీ 2021 జూన్ నెలలో కోవిడ్ మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని నాన్ రిఫండబుల్ అడ్వాన్స్ తీసుకోవచ్చని కార్మిక శాఖ ప్రకటించింది. ఇంతకుముందు ఈపీఎఫ్ సభ్యులు వన్‌టైమ్ అడ్వాన్స్ మాత్రమే పొందగలిగేవారు. 


ఈపీఎఫ్ఓ సభ్యులు మూడు నెలల బేసిక్ శాలరీ, డీఏలో 75 శాతాన్ని విత్‌డ్రా చేసుకునే అవకాశముంది. ఈ రెండింటిలో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని ఈపీఎఫ్ సభ్యులు విత్‌డ్రా చేసుకోవచ్చు. పీఎఫ్ అడ్వాన్స్‌ను ఇంటి కొనుగోలు, ఇంటి మరమ్మత్తులు, హోమ్ లోన్ తీర్చేందుకు, పెళ్లి ఖర్చులు, ఎడ్యుకేషన్ కోసం విత్‌డ్రా చేసుకోవచ్చు.


Also read: Aadhaar Update: ఆదార్ కార్డు ఫ్రీ అప్‌డేట్ గడువు పొడిగింపు, ఎలా చేయాలంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook