కోట్లాది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (Employees Provident Fund) సేవల్ని అందిస్తుంది. ఈపీఎఫ్ ఖాతాలు కలిగి ఉన్న వారికి భవిష్యత్తు నిధిగా పనిచేస్తుంది. వడ్డీ ప్రయోజనాలు, పన్ను మినహాయింపు, డెత్ బెనిఫిట్స్ లాంటి పలు సేవలు ఈపీఎఫ్‌వో ద్వారా ఆ ఖాతాదారులకు అందుతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేవలం 20 లేదా అంతకన్నా ఎక్కువ మంది ఉద్యోగులున్న కంపెనీకి ఉద్యోగులకు ఈపీఎఫ్ సౌకర్యం అందించేందుకు అవకాశం ఉంటుంది. ఉద్యోగి నెలవారీ జీతం బేసిక్ శాలరీ నుంచి 12 శాతం నగదు ప్రావిడెంట్ ఫండ్ ఖాతాకు చేరుతుంది. అదే సమయంలో ఉద్యోగి పనిచేస్తున్న కంపెనీ 8.33 శాతం ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (Employees Pension Scheme)కు, మిగతా 3.67 శాతం మొత్తాన్ని ఉద్యోగి ఈపీఎఫ్ ఖాతాకు జమ అవుతుంది.  రూ.15 వేల కన్నా తక్కువ వేతనం అందుకుంటున్న వారికి ఈపీఎఫ్ కటింగ్స్ తప్పనిసరి. అయితే ఈపీఎఫ్‌వో ఫామ్ 11 సమర్పించడం ద్వారా పీఎఫ్ కట్ కాకుండా చేసుకునే వీలుంది. 


Also Read: EPFO Alert: కరోనాతో EPF ఖాతాదారులు మరణిస్తే, నామినీకి రూ.7 లక్షల పరిహారం


కేంద్ర ప్రభుత్వం, ఈపీఎఫ్‌వో(EPFO)లు ఈపీఎఫ్ ఖాతాదారులకు ప్రస్తుతం 8.5 శాతం వడ్డీని అందిస్తుంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇంతే వడ్డీని అందించగా, మరో ఏడాదికి వడ్డీ రేటును కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈపీఎఫ్ వడ్డీ మీకు ఎంత వస్తుందో తెలుసుకోవడం చాలా తేలిక. మేం కింద తెలిపిన విధంగా మీరు ఈపీఎఫ్ వడ్డీని లెక్కించుకోండి.


మీ బేసిక్ శాలరీ రూ.20 వేలు అనుకుంటే 
ఉద్యోగి నెలవారీ EPF కాంట్రిబ్యూషన్ 20,000లో 12 శాతం అంటే రూ.2,400
కంపెనీ (Employer) నెలవారీ ఈపీఎస్ కాంట్రిబ్యూషన్ రూ.20,000లో 8.33 శాతం అంటే రూ.1,666
కంపెనీ (Employer) నెలవారీ ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ రూ.20,000లో 3.67 శాతం అంటే రూ.734
నెలవారీ ఈపీఎఫ్ మొత్తం కాంట్రిబ్యూషన్ రూ.3,134
ప్రస్తుతం ఈపీఎఫ్ ఖాతాలపై అందిస్తున్న వడ్డీ 8.50 శాతం అంటే నెలకు వచ్చే వడ్డీ 0.7083 శాతం వస్తుంది.  


Also Read: EPFO: ఈపీఎఫ్ నగదును ఖాతాదారులు పాత అకౌంట్ నుంచి ఇలా Transfer చేసుకోవచ్చు 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook