EPFO Jobs 2022: ఈపీఎఫ్ఓ కార్యాలయంలో ఉద్యోగాల భర్తీకై నోటిఫికేషన్ వెలువడింది. ఇంజనీర్ స్థాయి ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు ఎలా అప్లై చేయాలి, చివరి తేదీ ఏంటనేది తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈపీఎఫ్ఓ కార్యాలయంలో ఛీఫ్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్ పోస్టులు భర్తీ కానున్నాయి. మొత్తం 57 వేకెన్సీలున్నాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మే 30వ తేదీన విడుదలైంది. మే 30 నుంచి 45 రోజుల్లోగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. 


ఇందులో ఛీఫ్ ఇంజనీర్ పోస్టులు 1, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు 2, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు 21, జూనియర్ ఇంజనీర్ పోస్టులు 33 ఉన్నాయి. ఛీఫ్ ఇంజనీర్ పోస్టుకు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఇంజనీరింగ్ డిగ్రీతో పాటు పదేళ్ల అనుభవం ఉండాలి. ఇక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుకు 8 ఏళ్ల అనుభవముండాలి. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 4 నాలుగేళ్ల అనుభవముండాలి. జూనియర్ ఇంజనీర్ పోస్టుకు మూడేళ్ల అనుభవముండాలి.


ముందుగా ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్ సందర్శించాలి. నోటిఫికేషన్ ఎంచుకోవాలి. ఇందులోనే దరఖాస్తు కూడా ఉంటుంది.


Also read: Whatsapp New Feature: వాట్సాప్ యూజర్స్‌కు గుడ్‌ న్యూస్‌..కొత్త ఆప్షన్‌ ఇదే..!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook