Whatsapp New Feature: ప్రముఖ సోషల్ మీడియా కంపెనీ వాట్సాప్ (Whatsapp) వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం వాట్సాప్ వినియోగం పెరిగడంతో పలు రకాల ఫీచర్లను వినియోగదారులకు అనుగుణంగా తీసుకొస్తున్నట్లు పేర్కొంది. మారుతున్న టెక్నాలజీ కారణంగా వాట్సాప్‌లో ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్‌లు, ఫీచర్లు వస్తున్నాయి. అయితే ఇప్పుడు వాట్సాప్ ఓ కొత్త ఫీచర్‌ను తీసుకువస్తున్నట్లు సమాచారం. ఈ కొత్త ఫీచర్‌కు సంబంధించిన అంశాలేంటో తెలుసుకుందాం..
వాట్సాప్ (Whatsapp) త్వరలో ఎడిట్ ఆప్షన్‌ను తీసుకురాబోతున్నట్లు సమాచారం. వాట్సాప్ బీటా వెర్షన్‌లోని ఎడిట్ బటన్ మెసేజింగ్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ ఎడిట్ ఆప్షన్ ద్వారా టెక్స్ట్(సందేశం)ని పంపిన తర్వాత ఎవైన దోషాలుంటే సవరణ చేసుకునేందుకు వీలుగా ఉంటుందని సంస్థ పేర్కొంది.
వాట్సాప్‌లో ఎడిట్ ఆప్షన్:
WhatsApp ఇప్పుడు సందేశాలను పంపిన తర్వాత వాటిని ఎడిట్ చేసుకోవడానికి వినియోగదారులకు అనుమతి ఇస్తున్నట్లు వాట్సాప్ ట్రాకింగ్ వెబ్‌సైట్ Wabetainfo తెలిపింది. ఈ ఫీచర్ ఐదు సంవత్సరాల క్రితమే వాట్సాప్(WhatsApp) ఉండేనని పలు కారణాల వల్ల దీనిని తొలగించిందని నివేదికలో పేర్కొంది. చివరగా ఐదేళ్ల విరామం తర్వాత WhatsApp మళ్లీ ఎడిట్ ఫీచర్‌ని తీసుకురావడం విశేషం
Wabetainfo వివరాల ప్రకారం:
Wabetainfo వివరించిన సమాచారం ప్రకారం..వాట్సాప్(WhatsApp )లో ఎదైనా సందేశాన్ని పంపినప్పుడు అక్షర దోషాలు పోతూ ఉంటాయి. అయితే ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే అక్షర దోషాల గల సందేశాలను ఎడిట్ చేసికోని మెసెజ్‌లో ఉండే దోషాలను తొలగించవచ్చని పేర్కొంది. అంతే కాకుండా ఎంత పెద్ద సందేశాన్నైనా ఎడిట్ చేసుకోవచ్చని Wabetainfo నివేదికలో తెలిపింది.
Also Read: Papaya Benefits: బొప్పాయి పండుతో శరీరానికి ఇన్ని ప్రయోజనాలా..!!
Also Read: Thyroid Control Juice: ఈ మూడు జ్యూస్‌లు తాగండి..థైరాయిడ్ నుంచి ఉపశమనం పొందండి.!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook