కేంద్ర ప్రభుత్వం త్వరలో అంటే జనవరి 1, 2023 కొత్త ఏడాది నుంచి నోట్ల రద్దు విషయమై కీలక నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్న ఈ వార్తలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవలి కాలంలో వేయి రూపాయలు, రెండు వేల రూపాయల నోట్ల విషయంలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీని ప్రకారం ఆర్బీఐ జనవరి 1, 2023 నుంచి 2 వేల రూపాయల నోటును రద్దు చేయనుంది. అదే సమయంలో వేయి రూపాయల నోటును పునరుద్ధరించనుంది. ఈ వార్తలు సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారమౌతున్నాయి. అయితే ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా స్పష్టత ఇచ్చింది. 2 వేల రూపాయల నోటు ముద్రణ ఆగిందే తప్ప..రద్దు చేసే ఆలోచన లేదని తెలిపింది. 


ఇదగే విషయంపై పీఐబీ ఫ్యాక్ట్‌చెక్ చేసింది. జనవరి 1,2023 నుంచి 1000 రూపాయల నోటు ప్రవేశపెట్టనున్నారని..2000 నోటు రద్దు కానుందనే వార్తల్లో నిజం లేదని..పూర్తిగా అవాస్తవమని పీఐబీ ఫ్యాక్ట్‌చెక్ వెల్లడించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పోస్టులు పూర్తిగా నకిలీవని పీఐబీ గుర్తించింది. రిజర్వ్ బ్యాంక్ వద్ద ఇలాంటి ప్రణాళికలు లేవని..కేంద్ర ప్రభుత్వం కూడా తెలిపింది. 


మీరు కూడా వైరల్ అవుతున్న వార్తల్లో నిజమెంత ఉందనేది తెలుసుకోవచ్చు. ఎవరితోనూ షేర్ చేయకుండా..నేరుగా ఫ్యాక్ట్‌చెక్ వెబ్‌సైట్ ద్వారా తనిఖీ చేయవచ్చు. దీనికోసం ఫ్యాక్ట్‌చెక్ అధికారిక లింక్  https://factcheck.pib.gov.in/, వాట్సప్ నెంబర్ +918799711259, ఈ మెయిల్ ఐడీ +918799711259 ద్వారా చెక్ చేసుకోవచ్చు.


Also read: Tata Electric Car: టాటా ఎలక్ట్రిక్ కార్ల వెయిటింగ్ పీరియడ్ ఏ మోడల్‌కు ఎన్ని రోజులో తెలుసా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook