Zee Media Management rejects rumours of acquisition: ప్రముఖ మీడియా సంస్థ జీ మీడియాను కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూప్ సంప్రదింపులు జరుపుతోందనే ప్రచారాన్ని జీ మీడియా మేనేజ్‌మెంట్ కొట్టిపారేసింది. ఆ వార్తలు పూర్తిగా అవాస్తవమని, నిరాధారమని స్పష్టం చేసింది. గౌతం అదానీకి, జీ మీడియా ఛైర్మన్ సుభాష్ చంద్రకు మధ్య ఎలాంటి ఒప్పందం జరగలేదని.. పబ్లిక్, మైనారిటీ స్టేక్ హోల్డర్స్ ప్రయోజనాల దృష్ట్యా ఈ ప్రకటన చేస్తున్నామని జీ మీడియా ప్రతినిధి రోనక్ జత్వాలా వెల్లడించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దురుద్దేశపూర్వకంగానే జీ మీడియాను విక్రయిస్తున్నారనే ప్రచారాన్ని తెర పైకి తెచ్చారని... ఇది అన్‌వారెంటెడ్ స్టాక్ ట్రేడింగ్‌కి దారితీస్తోందని రోనక్ జత్వాలా పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సెబీ (SEBI) విచారణ జరపాలని... బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జీ మీడియాను  విక్రయిస్తున్నట్లు గతంలోనూ రూమర్స్ రాగా... అప్పుడు కూడా వాటిని కొట్టిపారేసిన విషయాన్ని గుర్తుచేశారు. అంతేకాదు, షేర్ వారెంట్స్ ద్వారా ఇటీవలే కంపెనీలో తమ వాటాను మరింత పెంచుకున్నామని వెల్లడించారు.


Also Read: Alia Bhatt Marriage: మా పెళ్లి ఎప్పుడో అయిపొయింది.. బాంబు పేల్చిన ఆలియా భట్‌!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook