FD vs NSC Post Office Schemes: పోస్టాఫీసు పథకాలు ఇటీవల గత కొద్దికాలంగా ప్రాచుర్యం పొందుతున్నాయి. కారణం వివిధ రకాల ప్లాన్స్ అందుబాటులో ఉండటంతో పాటు అధిక వడ్డీ, ట్యాక్స్ బెనిఫిట్స్ కలిగి ఉండటం. బ్యాంకుల కంటే ఎక్కువ సేవింగ్ ప్లాన్స్ అందుబాటులో ఉంటున్నాయి. మంచి రిటర్న్స్ ఆఫర్ చేస్తుంటాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అధిక వడ్డీ, ట్యాక్స్ మినహాయింపులు కావాలంటే 5 ఏళ్ల ఫిక్స్డ్ డిపాజిట్ మంచి ప్రత్యామ్నాయం కాగలదు. దీనినే ట్యాక్స్ ఫ్రీ ఎఫ్‌డి అని కూడా పిలుస్తారు. ఇది కాకుండా పోస్టాఫీసుల్లో నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ ఆప్షన్ కూడా ఉంది. ఇందులో కూడా మంచి రిటర్న్స్ అందుతాయి. పోస్టాఫీసు ఎఫ్‌డిలో 7.5 శాతం వడ్డీ లభిస్తే..నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్‌లో 7.7 శాతం వడ్డీ లభిస్తుంది. ఒకవేళ మీరు 5 లక్షలు ఇన్వెస్ట్ చేయాలంటే 5 ఏళ్లకు ఎఫ్‌డితో ఎంత లాభం వస్తుంది, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్‌తో ఎంత లాభం కలుగుతుందనేది చూద్దాం.


పోస్టాఫీసు ఎఫ్‌డి వర్సెస్ ఎన్‌ఎస్‌సి


పోస్టాఫీసు ఎఫ్‌డి లో 2 లక్షలు పెట్టుబడి పెడితే ప్రస్తుతం లభిస్తున్న 7.5 శాతం వడ్డీ ప్రకారం ఐదేళ్ళకు 89, 990 రూపాయలు వడ్డీ రూపంలో లభిస్తుంది. అంటే మెచ్యూరిటీ పూర్తయ్యాక 2,89,990 రూపాయలు చేతికి అందుతాయి. అదే నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్‌లో 2 లక్షలు పెట్టుబడి పెడితే 7.7 శాతం వడ్డీ చొప్పున 5 ఏళ్లకు 89,807 రూపాయలు వడ్డీగా అందుతుంది. అంటే మెచ్యూరిటీ పూర్తయ్యాక 2,89,807 రూపాయలు చేతికి అందుతాయి.


అంటే పోస్టాఫీసు ఎఫ్‌డి వర్సెస్ ఎన్‌ఎస్‌సి రిటర్న్స్ పరిశీలిస్తే రెండింటి మధ్య పెద్దగా అంతరం లేదు. పోస్టాఫీసు ఎఫ్‌డిలో వడ్డీని ప్రతి మూడు నెలలకోసారి లెక్కిస్తారు. ఎన్‌ఎస్‌సి అయితే ఏడాదికోసారి లెక్కిస్తారు. అంటే రెండింట్లో ఎందులో ఇన్వెస్ట్ చేసినా రిటర్న్స్ దాదాపు సమానంగా ఉంటాయి.ట్యాక్స్ మినహాయింపు ఎందులో ఎక్కువగా ఉందో బేరీజు వేసుకుని అందులో ఇన్వెస్ట్ చేస్తే మంచిది.


Also read: 8th Pay Commission: 8వ వేతన సంఘం ఏర్పడుతుందా, ఉద్యోగులకు కలిగే లాభాలేంటి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook