Flipkart OnePlus U1S TV Offer: చైనాకు చెందిన ఎలక్ట్రానిక్ సంస్థ 'వ‌న్‌ప్ల‌స్' గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ దేశాలతో పాటు భారత్‌లో వ‌న్‌ప్ల‌స్‌కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటికే స్మార్ట్ ఫోన్ రంగంలో అద్భుతాలు సృష్టించిన వ‌న్‌ప్ల‌స్.. వరుసగా స్మార్ట్ టీవీలను కూడా మార్కెట్లోకి వదులుతోంది. స్మార్ట్ ఫోన్ మాదిరే స్మార్ట్ టీవీలకు కూడా మన దగ్గర భారీ డిమాండ్ ఉంది. స్మార్ట్ టీవీలలో కూడా ప్రస్తుతం చాలా సిరీస్‌లు అందుబాటులో ఉన్నాయి. వ‌న్‌ప్ల‌స్‌ యూ1ఎస్ టీవీపై ప్ర‌స్తుతం ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో అద్భుత ఆఫర్ ఉంది. చాలా తక్కువ ధరలో అందుబాటులో ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

24 శాతం ఆఫర్: 
ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం 'అప్లిన్సెస్ బొనాంజా' సేల్ ఉంది. ఈ సెల్ ఆగష్టు 11న ఆరంభం అయి ఆగష్టు 15తో ముగియనుంది. ఈ సేల్‌లో భాగంగా వ‌న్‌ప్ల‌స్‌ యూ1ఎస్ టీవీపై రూ. 12000 తగ్గింపు ఆఫర్ ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో వ‌న్‌ప్ల‌స్‌ యూ1ఎస్ టీవీ 50 ఇంచ్ అల్ట్రా హెచ్‌డీ 4K ఎల్‌ఈడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ అసలు ధర రూ. 49,999గా  ఉంది. 'అప్లిన్సెస్ బొనాంజా' సేల్‌లో భాగంగా ఈ టీవీపై 24 శాతం ఆఫర్ ఉంది. అంటే రూ. 12000 వేల తగ్గింపుతో ఈవ‌న్‌ప్ల‌స్‌ యూ1ఎస్ టీవీ రూ. 37,999లకు అందుబాటులో ఉంది. 


క్రెడిట్, డెబిట్ కార్డుపై 10 శాతం:
వ‌న్‌ప్ల‌స్‌ యూ1ఎస్ టీవీపై బ్యాంక్ ఆఫర్‌ కూడా ఉంది. సిటీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డుపై 10 శాతం ఆఫర్ ఉంది. ఈ ఆఫర్ ద్వారా రూ. 3000 తగ్గనుంది. ఇక ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ. 16900 వరకు ఆదా చేసుకోవచ్చు. మీ పాత స్మార్ట్‌ టీవీని ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద ఇస్తే.. రూ. 16900 సేవ్ చేసుకోవచ్చు. అయితే మీ పాత స్మార్ట్‌ టీవీ కండిషన్ బాగుంటేనే పూర్తి ఆఫర్ వర్తిస్తుంది. ఈ అవకాశం ఈ ఒక్క రోజే ఉంది కాబట్టి వెంటనే త్వరపడండి. 


వ‌న్‌ప్ల‌స్‌ యూ1ఎస్ టీవీ స్పెసిఫికేషన్లు:
# 50 ఇంచ్ అల్ట్రా హెచ్‌డీ 4K ఎల్‌ఈడీ స్క్రీన్
# 2 జీబీ ర్యామ్, 16 జీబీ మెమోరీ
# ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం
# ప్రాసెసర్ Cortex-A55 x 4
# రెసొల్యూషన్ 3840 x 2160
# 30 వాట్ల సౌండ్ అవుట్ పుట్
# రిఫ్రెష్ రేట్ 60 Hz


Also Read: నేడు 75వ స్వాతంత్య్ర దినోత్సవం.. క్రీడలలో 75 ఐకానిక్ మూమెంట్స్ ఇవే!


Also Read: Diabetes: పసుపు, దాల్చిన చెక్కతో కూడా డయాబెటిస్ వ్యాధికి చెక్ పెట్టొచ్చు..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook