Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్‌లో భారీ ఆఫర్లు.. రూ.20,990 స్మార్ట్ ఫోన్.. కేవలం రూ.1,165కే..!
Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్‌లో ఒప్పో ఫోన్లపై భారీ డిస్కౌంట్ సేల్ నడుస్తోంది. నేడు ఈ ఆఫర్లకు చివరి తేదీ. ఇందులో 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ గల ఒప్పొ ఏ55 ఫోన్‌ను రూ.1,165కే పొందే వీలుంది. అదెలానో ఇప్పుడు చూద్దాం.
Flipkart Offers: దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్.. ఒప్పొ ప్రోడక్ట్‌ల కోసం ప్రత్యేక సేల్ (Flipkart offers on Oppo phones) నిర్వహిస్తోంది. ఒప్పొ అడ్వాన్స్ డేస్ పేరుతో ఈ సేల్ కొనసాగుతోంది. ఈ సేల్‌లో భాగంగా ఒప్పొ గాడ్జెట్స్‌పై 5 శాతం నుంచి 20 శాతం వరకు డిస్కౌంట్ (Flipkart latest offers) ఇస్తోంది.
ఈ నెల 21 నుంచి ఈ సేల్ అందుబుటాలో ఉంది. ఈ ఆఫర్లకు నేడే ఆఖరు తేదీ. మరి చివరి రోజు డిస్కౌంట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
ఒప్పొ ఏ55పై బంపర్ డిస్కౌంట్..
ఒప్పొ ఏ55 4జీ మొబైల్ ఫోన్ (6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్) మార్కెట్ ధర (Oppo A 55 price) రూ.20,990 ఉంది. దీనిపై 16 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తోంది ఫ్లిప్‌కార్ట్. అంటే డిస్కౌంట్ పోనూ ఈ మొబైల్‌ను రూ.17,490కి ఈ ఫోన్ లభిస్తుంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో చెల్లింపు జరిపితే.. మరో 5 శాతం (రూ.875) క్యాష్ బ్యాక్ లభిస్తుంది. అప్పుడు ఫోన్ ధర రూ.16,615కి చేరుతుంది.
ఈ ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా ఇస్తోంది. ఏదైనా పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా రూ.15,450కి తగ్గింపు పొందొచ్చు. మీరు ఎక్స్ఛేంజ్ ఆఫర్లో పూర్తి డిస్కౌంట్‌ను పొందగలిగితే.. అప్పుడు కొత్త ఫోన్‌ను కేవలం రూ.1,165కే పొందొచ్చు.
ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు
6.51 అంగుళాల హెచ్డీ ప్లస్ డిస్ప్లే
6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్
మీడియా టెక్ హీలియో జీ35 ప్రాసెసర్
వెనుకవైపు మూడు కెమెరాలు (50 ఎంపీ+2 ఎంపీ+2 ఎంపీ)
16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా
5,000 ఎంఏహెచ్ బ్యాటరీ
Also read: Bank Holidays January 2022: జనవరిలో మొత్తం 16 బ్యాంక్ హాలిడేస్- పూర్తి వివరాలివే..
Also read: Todays Gold Rate: స్వల్పంగా తగ్గిన బంగారం ధర, దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook