Todays Gold Rate: పసిడి ప్రియులకు కాస్త ఊరట. బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. నిన్న భారీగా పెరిగిన బంగారం ధర..ఇవాళ కాస్త తగ్గింది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధర ఇలా ఉంది.
బంగారం ధరలు ఏరోజుకారోజు మారిపోతుంటాయి. ఒకరోజు పెరిగితే..మరోరోజు తగ్గిపోతుంది. హెచ్చుతగ్గులు నిరంతరం ఉంటూనే ఉంటాయి. అంతర్జాతీయంగా బంగారం డిమాండ్, వివిధ దేశాల మధ్య భౌగోళిక పరిస్థితులు, డాలర్ విలువ, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వలు, వడ్డీ రేటు, ద్రవ్యోల్బణం బంగారం ధరల్లో(Gold Price) మార్పులకు కారణమౌతుంది. ఈ పరిస్థితుల్లో నిన్న శుక్రవారం బంగారం ధర ఒక్కసారిగా పెరిగింది. ఇవాళ కాస్త తగ్గుముఖం పట్టింది.
దేశ రాజధాని నగరం ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ 47 వేల 500 కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల 51 వేల 800కు చేరింది. అటు కిలో వెండి ధర 62 వేల 4 వందల రూపాయలుగా ఉంది. మంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల 47 వేల 300 కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 48 వేల 300 రూపాయలుంది. కోల్కత్త నగరంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 47 వేల 450 రూపాయలైతే..24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 50 వేల 150 రూపాయలుగా ఉంది. ఇక బెంగళూరు నగరంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 350 రూపాయలు కాగా..24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 480 రూపాయలుగా ఉంది. అటు వెండి ధర కూడా కిలో 62 వేల 4 వందలుంది.
అటు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర ఇతర నగరాలతో పోలిస్తే తక్కువగా ఉంది. హైదరాబాద్ నగరంలో(Hyderabad Gold Rate)22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 350 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 480 రూపాయలుంది. విజయవాడ నగరంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 350 రూపాయలుంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 480 రూపాయలకు చేరింది. ్టు విశాఖపట్నంలో కూడా అదే ధర ఉంది. ఇక కిలో వెండి 66 వేల 100 రూపాయలు పలుకుతోంది.
Also read: RBI New Rule: కొత్త పేమెంట్ రూల్స్ అమలు జనవరి 1 నుంచి కాదు.. కొత్త తేదీ ఇదే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook