Bank Holidays January 2022: భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) 2022 జనవరి బ్యాంక్ సెలవుల జాబితాను (Bank Holidays for January 2022) ప్రకటించింది. ఆర్బీఐ జాబితా ప్రకారం.. జనవరిలో మొత్తం 16 బ్యాంక్ సెలవులు ఉన్నాయి. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే.. ఈ 16 రోజుల సెలవులు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు వర్తించవు. స్థానిక పండుగలను, ప్రత్యేక రోజులను బట్టి ఈ సెలవులు (Bank Holidays in January 2022) ఉంటాయి.
రెండు నేషనల్ హాలిడేస్..
వచ్చే నెలలో మొత్తం 16 సెలవుల్లో రెండు నేషనల్ హాలిడేస్ కావడం (National wide Bank Holidays) గమనార్హం. ఒకటి కొత్త సంవత్సరం (జనవరి 1) కాగా రెండోది గణతంత్ర్య దినోత్సవం (జనవరి 26).
జనవరి బ్యాంక్ సెలవుల జాబితా..
జనవరి 1: కొత్త సంవత్సరం (దేశవ్యాప్తంగా సెలవు)
జనవరి 2: ఆదివారం సాధారణ సెలవు
జనవరి 4: లోసూంగ్ (సిక్కిం)
జనవరి 8: రెండో శనివారం
జనవరి 9: ఆదివారం సాధారణ సెలవు
జనవరి 11: మిషినరీ డే (మిజోరం)
జనవరి 12: స్వామి వివేకానంద జయంతి
జనవరి 14: మకర సంక్రాంతి, పొంగల్ (వివిధ రాష్ట్రాల్లో)
జనవరి 15: సంక్రాంతి, పొంగల్, తిరువళ్లువర్ డే (ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరి సహా పలు ఇతర రాష్ట్రాల్లో)
జనవరి 16: ఆదివారం సాధరణ సెలవు
జనవరి 18: తాయ్ పోసమ్ (చెన్నై)
జనవరి 22: నాలుగో శనివారం
జనవరి 23: ఆదివారం సాధారణ హాలిడే
జనవరి 26: రిపబ్లిక్ డే (దేశవ్యాప్తంగా సెలవు)
జనవరి 30: ఆదివారం సాధారణ సెలవు
జనవరి 31: మి-దామ్-మి-ఫీ (అసోం)
Also read: RBI New Rule: కొత్త పేమెంట్ రూల్స్ అమలు జనవరి 1 నుంచి కాదు.. కొత్త తేదీ ఇదే..!
Also read: Year ending 2021: డిసెంబర్ 31 సమీపిస్తోంది.. ఈ పనులు పూర్తి చేశారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook