COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Force Gurkha 5-door: ప్రస్తుతం మార్కెట్లో ఆఫ్ రోడ్ కార్లకు మంచి డిమాండ్ ఉంది. చాలామంది యువత ఇలాంటి కార్లను కొనుగోలు చేసేందుకే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అయితే దీనిని దృష్టిలో పెట్టుకొని మహీంద్రా గతంలోని ప్రీమియం ఫీచర్లతో థార్ అనే మోడల్ ను లాంచ్ చేసింది. అయితే దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ ఫోర్స్ కూడా గూర్ఖా 5-డోర్‌ ఆఫ్ రోడ్ SUV ని త్వరలోనే లాంచ్ చేయబోతున్నట్లు తెలిపింది. ఈ ఆఫ్ రోడ్ కారు అనేక శక్తివంతమైన ఫీచర్లతో పెద్ద ఇంజన్ సెటప్ తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే విడుదలకు ముందే ఈ కారుపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఈ కారు తెగ ట్రెండ్ అవుతోంది. గూర్ఖా 5-డోర్‌  (force gurkha 5-door) ఆఫ్ రోడ్ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.


ఫోర్స్ గూర్ఖా 5-డోర్ (force gurkha 5-door) కారును కంపెనీ ఈ సంవత్సరంలోనే ఉన్నట్లు వెల్లడించింది అయితే ఈ కారుకు సంబంధించిన టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కారు ఫైవ్ డోర్ సెట్అప్ తో పాటు మరెన్నో కొత్త ఫీచర్లతో రాబోతోంది. ఈ ఆఫ్ రోడ్ కారు మార్కెట్లోకి లాంచ్ అయితే త్వరలోనే విడుదల కాబోయే మహీంద్రా థార్ 5-డోర్‌కు పోటీ పడుతుంది. అయితే ఈ కార్ కు సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళ్తే, పొడవైన వీల్ బేస్ తో ఆఫ్ రోడ్ కి అనుగుణంగా రాబోతోంది. దీంతోపాటు ఈ కారు ఇంతకుముందు లాంచ్ చేసిన గూర్ఖా మూడు డోర్ల డిజైన్ ను కలిగి ఉంటుంది కానీ అనేక రకాల శక్తివంతమైన ఫీచర్లతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. గూర్ఖా 3-డోర్‌లో సైడ్-ఫేసింగ్ పెద్ద రియర్ విండోను రోల్-డౌన్ విండో తో అందుబాటులోకి తీసుకువచ్చారు అయితే ఐదు డోర్ల తో రాబోయే గూర్ఖాను కూడా ఇలాంటి డిజైన్ నే కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 


దీంతోపాటు ఈ force gurkha 5-door ఆఫ్ రోడ్ కారు పెద్ద బూట్ స్పేస్ కూడా లభించనంది. దీంతోపాటు ఇందులో బెంచ్ లేదా కెప్టెన్ సీట్లు ఉండే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇక ఈ కారుకు సంబంధించిన ఇంజన్‌ వివరాల్లోకి వెళితే, ఇది నాలుగు-సిలిండర్స్‌తో కూడిన 2.6-లీటర్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా దీని ఇంజన్‌ టర్బో డీజిల్‌ వేరియంట్‌లో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఇది 91bhp శక్తినితో పాటు 250Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. అయితే ఈ కారు ఫోర్‌ వీల్‌ డ్రైవ్‌ 4x4 కాన్ఫిగరేషన్‌తో వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌పై పని చేస్తుంది.


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..    


ఫోర్స్ గూర్ఖా 5-డోర్ కారు టాప్‌ 10 ఫీచర్స్‌:
1. 5-డోర్ డిజైన్: 3-డోర్ మోడల్‌ కంటే ఎక్కువ ప్రయాణికులకు సౌకర్యం
2. మెరుగైన ఇంజన్: 2.6-లీటర్ డీజల్ ఇంజన్, 91 PS శక్తి, 250 Nm టార్క్
3. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్: 5-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్
4. 4x4 డ్రైవ్ ట్రైన్: ఆఫ్-రోడ్ సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది
5. మెరుగైన సస్పెన్షన్: ముందు ఇండిపెండెంట్ సస్పెన్షన్, వెనుక లీఫ్ స్ప్రింగ్ సస్పెన్షన్
6. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్: 7-అంగుళాల టచ్‌స్క్రీన్, Android Auto & Apple CarPlay
7. ఫీచర్-లోడెడ్: LED హెడ్‌ల్యాంప్‌లు, DRLs, ఫోగ్ ల్యాంప్‌లు, ఎలక్ట్రిక్ ORVMs, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్
8. సురక్షితమైన: డ్యుయల్ ఎయిర్‌బ్యాగులు, ABSతో EBD, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు
9. స్థిరమైన: డీప్ వేడింగ్ సామర్థ్యం, స్నోర్కెల్, 4x4 లో-రేంజ్ ట్రాన్స్‌ఫర్ కేస్
10. ఆకర్షణీయమైన డిజైన్: బోల్డ్ డిజైన్, స్క్వేర్ హెడ్‌ల్యాంప్‌లు, బ్లాక్ అవుట్ థీమ్


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి