JioFiber New Entertainment Plans: వినూత్న పథకాలు, ఆఫర్లతో ఎప్పటికప్పుడు కస్టమర్లను ఆకట్టుకునే జియో ఇప్పుడు మరో రెండు కొత్త ప్లాన్స్ విడుదల చేసింది.  ఈ ప్లాన్స్ తీసుకుంటే ఏకంగా ఆరు ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు పొందవచ్చు. ఎలాగంటే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జియో ఫైబర్ కొత్తగా రెండు ఇంటర్నెట్ ప్లాన్స్  లాంచ్ చేసింది. వీటిలో వినియోగదారులకు ఓటీటీ యాప్స్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. అయితే ఇది పోస్ట్ పెయిడ్ ప్లాన్స్‌కు వర్తించనుందని కంపెనీ తెలిపింది. మీరు కూడా జియో ఫైబర్ వినియోగదారుడైతే..మీరు కేవలం 999 రూపాయల ప్లాన్ తీసుకుంటేనే ఓటీటీ సభ్యత్వం లభిస్తుంది. అయితే ఇది దేశంలో ఎక్కువ శాతం మందికి కష్టమే. అందుకే జియో ఫైబర్ కొత్త ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్స్ విడుదల చేసింది. ఈ ప్లాన్స్ 399 రూపాయలు, 699 రూపాయల ప్లాన్స్‌కు అదనంగా లభించనున్నాయి. ఇందులో యూజర్స్‌కు 30 ఎంబీపీఎస్, 100 ఎంబీపీఎస్ స్పీడ్ నెట్ లభిస్తుంది. జియో ఫైబర్ కొత్తగా ఎంటర్‌టైన్‌మెంట్, ఎంటర్‌టైన్‌మెంట్ ప్లస్ ప్లాన్లను లాంచ్ చేసింది. ఆ వివరాలు తెలుసుకుందాం.


జియో ఫైబర్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్‌లో..


ఈ కొత్త ప్లాన్ 399 రూపాయలు లేదా 699 రూపాయలకు అదనం. మీరు ఈ రెండింటిలో ఏదో ఒక ప్లాన్ ఎంచుకోవాలి. తరువాత నెలకు ప్రతి నెల వంద రూపాయల ఇంటర్‌నెట్ ప్లాన్ తీసుకోవాలి. అప్పుడు మీకు దాంతోపాటు ఆరు ఓటీటీ సభ్యత్వాలు లభిస్తాయి.


జియో ఫైబర్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లస్ ప్లాన్‌లో..


ఒకవేళ మీకు ఎక్కువ ఓటీటీ సభ్యత్వాలు కావాలనుకుంటే..ఎంటర్‌‌టైన్‌మెంట్ ప్లస్ ప్లాన్ మంచిది. ఇందులో మీరు ప్రతి నెలా 2 వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో మీకు 14 ఓటీటీ సభ్యత్వాలు లభిస్తాయి. అవి డిస్నీ హాట్‌స్టార్, జీ5, సోనీలివ్, వూట్, సన్నెక్స్‌ట్, డిస్కవరీ ప్లస్, హోయి‌చోయ్. ఆల్ట్ బాలాజీ, ఎరోస్ నౌ, లయన్స్‌గేట్, షెమారూ‌మి, యూనివర్శనల్ ప్లస్, వూట్ కిడ్స్, జియో సినిమా ఉన్నాయి. ఈ ప్లాన్స్ జియో ఫైబర్ పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు వర్తిస్తుంది. మీరు ఒకవేళ జియో ఫైబర్ ప్రీ పెయిడ్ కస్టమర్ అయితే..వెంటనే పోస్ట్‌పెయిడ్ కస్టమర్‌గా మారండి. అప్పుడు మీకు ఈ ప్లాన్ వర్తిస్తుంది. మీరు కంపెనీ నుంచి ఇంటర్నెట్ ప్లాన్ తీసుకుంటే..సెటప్ బాక్స్ కూడా అందుతుంది. 


ఇతర స్కీమ్స్‌లో ఏ విధమైన మార్పులు చేయలేదు. ఇప్పటికీ మీరు ఏ విధమైన ఓటీటీ సభ్యత్వం అవసరం లేకుండానే ఎంట్రీ లెవెల్ ప్లాన్స్ కొనసాగించాలనుకుంటే చేయవచ్చు. ఓటీటీ సభ్యత్వం కావాలనుకుంటే ఇలా చేయవచ్చు. 


Also read: Microsoft Editor: మైక్రోసాఫ్ట్‌ ఎడ్జ్‌ బ్రౌజర్‌లో రెండు కొత్త ఫీచర్లు.. అవి ఎలా వినియోగించాలంటే.. ?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook