Citroen C3 Aircross Launch: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సిట్రోయెన్ ఇండియా సి3 ఎయిర్ క్రాస్ విత్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వెర్షన్ ఇండియాలో వచ్చేసింది. మూడు వేరియంట్లలో లాంచ్ అయిన సిట్రోయెన్ సి3 ఎయిర్ క్రాస్ హ్యుండయ్ క్రెటా వంటి ఎస్‌యూవీలకు పోటీ కానుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇండియాలో సిట్రోయెన్ సి3 కార్ల బుకింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. 25 వేలు టోకెన్ చెల్లించి బుక్ చేసుకోవచ్చు. Citroen C3 Aircross ఆటోమేటిక్ వేరియంట్‌లో 1.2 లీటర్ , 3 సిలెండర్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇందులో మేన్యువల్ కూడా లభిస్తుంది. 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో అనుసంధానమైన ఇంజన్ 109 బీహెచ్‌పి పవర్, 205 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. మైలేజ్ కూడా 17.6 కిలోమీటర్లు ఇస్తుంది. ఇందులో వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో పాటు 102 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 4 స్పీకర్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్, కనెక్టెడ్ కార్ టెక్, ఫ్రంట్ అండ్ రేర్ యూఎస్‌బి ఛార్జర్, రేర్ రూఫ్ వెంట్, రేర్ డీఫాగర్, రిమూవబుల్ సీట్స్, అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇలా చాలా ఫీచర్లు ఉన్నాయి. 


సిట్రోయెన్ సి3 ఎయిర్‌క్రాస్ మేన్యువల్ వేరియంట్ ధర అయితే 9.99 లక్షల్నించి 12.75 లక్షలుంటుంది. సిట్రోయెన్ సి3 ఎయిర్ క్రాస్ ప్లస్, మ్యాక్స్, మ్యాక్స్ 5+2 సీట్లతో లాంచ్ అయింది. సిట్రోయెన్ సి3 ప్లస్ ఏటీ వేరియంట్ ధర 12.85 లక్షలు కాగా మ్యాక్స్ 5 సీటర్ ఏటీ వేరియంట్ ధర 13.50 లక్షలుంది. ఇక ఇందులోనే 7 సీటర్ వేరియంట్ ధర 13.85 లక్షలుగా ఉంది. 


Also read: IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook