Gautam Adani: ముకేశ్ అంబానీని దాటేసి.. ఆసియాలో అపర కుబేరుడిగా గౌతమ్ అదానీ
Asias Richest Man: రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీని వెనక్కి నెట్టి ఆసియాలో అత్యంత సంపన్నుడిగా అవతరించారు గౌతమ్ అదానీ. ఆయన సంపద రోజుకు సగటున రూ.1000 కోట్లుగా ఉన్నట్లు ఓ నివేదిక ద్వారా తెలిసింది.
Gautam Adani, has replaced Mukesh Ambani to become the richest man in India and Asia: అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ మరో రికార్డు సృష్టించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీని వెనక్కి నెట్టి.. భారత్, ఆసియాలో అత్యంత సంపన్నుడిగా అవతరించారు.
ప్రస్తుతం గౌతమ్ అదానీ సంపద విలువ ప్రస్తుతం 90 బిలియన్ డాలర్లుగా (Gautam Adani Net Wealth) అంచనా. గత ఏడాది మార్చి 18న ఈయన సంపద 4.91 బిలియన్ డాలర్లుగా ఉండగా.. కరోనా సంక్షోభంలో అది రికార్డరు స్థాయిలో పెరిగింది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. గత ఏడాది మార్చితో పోలిస్తే గౌతమ్ అదానీ సంపద 1800 శాతం పెరిగిందని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ద్వారా తెలిసింది.
దీనితో 2015 నుంచి దేశంలో అగ్రస్థానాన్ని కొనసాగిస్తున్న ముకేశ్ అంబానీ రికార్డును చెరిపేశారు గౌతమ్ అదానీ.
Also read: Bank Holidays: డిసెంబర్‌లో ఏకంగా 16 రోజులు బ్యాంకులకు సెలవులు.. అవేంటో మీరే చూడండి!
ముకేశ్ సంపద ఎంతంటే..
బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. ముకేశ్ అంబానీ సంపద ప్రస్తుతం 88.8 బిలియన్ డాలర్లుగా (Mukesh Ambani Net Wealth) అంచనా. గత ఏడాదితో పోలిస్తే.. ముకేశ్ అంబానీ సంపద 54.7 బిలియన్ డాలర్లు పెరిగింది.
ఇటీవల రోజుకు రూ.1000 కోట్లు సంపాదిస్తూ గౌతమ్ అదానీ ముందుకు (Gautam Adani Daily income) దూసుకెళ్తుంటే.. ముకేశ్ అంబగానీ స్పంపద కాస్త తగ్గింది.
రిలయన్స్ ఓ2సీ వ్యాపారాల్లో ఆరామ్కో పెట్టుబడుల విషయాన్ని మరోసారి సమీక్షించాలని ఇరు కంపెనీలు నిర్ణయించడంతో.. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు నష్టపోతూ (RIL Aramco daal) వస్తున్నాయి. దీనితో అంబానీ నికర విలువ కూడా తగ్గుతోంది. ఇదే సమయంలో అదానీ సంపద పెరుగూ పోతున్న కారణంగా ఆయన.. దేశంలోనే అత్యంత సంపన్నుడిగా అవతరించారు.
Also read: Bumper Offer: రూ. 19,900 ధర గల Samsung 32-ఇంచెస్ TV.. కేవలం రూ. 5,240కే.. త్వరపడండి!
ఒడుదొడుకులను దాటుకుని..
అదానీ గ్రూప్ కంపెనీల్లో భారీ పెట్టుబడులు పెట్టిన మూడు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల ఖాతాలను.. సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్(ఎన్‌ఎస్‌డీఎల్) నిలిపివేసిందని వచ్చిన వార్తలతో కొన్ని నెలల క్రితం అదానీ షేర్లు కుప్పకూలాయి. ఈ వార్తలు బయటకు వచ్చిన కొన్ని గంటల్లోనే అదానీ నికర విలువ రూ.55 వేల కోట్ల డాలర్లు పడిపోయింది.
అయితే ఆ వార్తల్లో నిజం లేదని కంపెనీ అధికారికంగా ప్రకటించడంతో.. మళ్లీ.. షేర్లు తిరిగి పుంజుకున్నాయి. ఆ తర్వాత మళ్లీ సంపద జోరును కొనసాగిస్తూ.. అదానీ ఇప్పుడు ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా అవతరించారు.
Also read: క్రిప్టోకరెన్సీపై కేంద్రం కీలక నిర్ణయం, శీతాకాల సమావేశాల్లో ప్రత్యేక బిల్లు యోచన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook