Gold Price: 56 వేలు దాటేసిన బంగారం ధర, ఆల్ టైమ్ హైతో రికార్డు స్థాయికి చేరనున్న బంగారం
Gold Price: బంగారం ధరలు రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్నాయి. అటు వెండి కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. ఆల్ టైమ్ గరిష్ట ధరకు చేరువలో ఉంది బంగారం ధర. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌లో బంగారం ధర 56 వేలకు ట్రేడ్ అవుతోంది.
వారంలో తొలి పనిదినంలో బంగారం ధర అత్యంత వేగంగా పెరుగుతూ కన్పిస్తోంది. ఆల్ టైమ్ గరిష్ట ధరకు కేవలం 200 రూపాయల దూరంలో ఉంది. త్వరలో బంగారం ధర రికార్డు స్థాయికి చేరవచ్చని అంచనా. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌లో ఇవాళ బంగారం ధర 56 వేలకు ట్రేడ్ అవడం విశేషం.
బంగారం ధర ఎంత పెరిగింది
మల్టీ కమ్మోడిటీ ఎక్స్చేంజ్‌లో బంగారం ధర ఇవాళ 0.55 శాతం వేగంతో పది గ్రాముల బంగారం 56,050 రూపాయలకు చేరుకుంది. ఇవాళ బంగారం ధర 55, 800 రూపాయలకు ఓపెన్ అయిన కాస్సేపటికే 56 వేలు దాటేసింది. గత వారంలో బంగారం ధర 440 రూపాయలు పెరిగి 55, 730 రూపాయలకు క్లోజ్ అయింది.
వెండి ధర ఎంత పెరిగింది
వెండి ధర కూడా ఇవాళ భారీగా వృద్ధి నమోదు చేసింది. ఇవాళ వెండి ధర 0.64 శాతం పెరుగుదలతో 69,600కు చేరుకుంది. ఇవాళ కిలో వెండి ధర 69,500 రూపాయలకు ఓపెన్ అయింది. గడిచిన వారంలో 1100 పెరిగి 69, 178 రూపాయలకు క్లోజ్ అయింది.
గ్లోబల్ మార్కెట్‌లో పుంజుకున్న బంగారం, వెండి ధరలు
అంతర్జాతీయ మార్కెట్ పరిశీలిస్తే..బంగారం, వెండి రెండూ గ్రీన్ కలర్‌లో ట్రేడ్ అవుతున్నాయి. బంగారం ధర ఇవాళ 0.63 శాతం పెరుగుదలతో ఔన్స్ బంగారం 1,877 డాలర్లు కాగా, వెండి ధర ప్రతి ఔన్స్ 0.62 శాతం పెరుగుదలతో 23.98 డాలర్లకు ట్రేడ్ అవుతోంది.
ఇంట్లో ఉండి బంగారం, వెండి ధరల్ని పరిశీలించాలనుకుంటే..8955664433 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే చాలు. మీ మొబైల్ నెంబర్‌కు మెస్సేజ్ వస్తుంది. ఇతర వివరాలకు www.ibja.co లేదా ibjarates.com వెబ్‌సైట్ సందర్శించవచ్చు.
Also read: Investment Tips: కొత్త ఏడాదిలో మీ డబ్బును ఇలా పెట్టుబడి పెట్టండి.. ఆదాయం డబుల్ కావడం పక్కా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook