Gold Price Today: బంగారం, వెండి ధరల్లో గత రెండ్రోజుల్నించి తగ్గుదల కన్పిస్తోంది. వరుసగా మూడవ రోజు బంగారం, వెండి ధర తగ్గడంతో బంగారం ప్రియులు ఆనందపడుతున్నారు. దేశంలోని ప్రదాన నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత రెండ్రోజుల్నించి బంగారం, వెండి ధరలు(Gold and Silver Prices) తగ్గుతూ వస్తున్నాయి. వరుసగా రెండ్రోజుల్నించి తగ్గుతూ వస్తున్న ధరల తగ్గుదల మూడవ రోజు కూడా కొనసాగింది. అంతర్జాతీయంగా బంగారం ధరల తగ్గుదలే దీనికి కారణంగా తెలుస్తోంది. అటు వెండి పరిస్థితి కూడా అలాగే ఉంది. బంగారం ధరలు(Gold Price Today) తగ్గుతుండటంతో బంగారం ప్రియులు ఆనందపడుతున్నారు. 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 330 రూపాయలు తగ్గింది. దాంతో బంగారం పదిగ్రాములు ఇప్పుడు 48 వేల 110 రూపాయలకు చేరింది. అటు 22 క్యారెట్ల బంగారం పదిగ్రాములపై కూడా 3 వందల రూపాయలు తగ్గడంతో 44 వేల 100 రూపాయలకు చేరింది. వెండి ధర కూడా పడిపోయింది. కిలో వెండిపై 5 వందల రూపాయలు తగ్గింది. కిలో వెండి ధర 69 వేల 100 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయంగా బంగారం ధర 0.14 శాతం క్షీణించింది. ఫలితంగా పసిడి రేటు ఔన్స్‌కు 1791 డాలర్లు తగ్గింది. 


ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం(Delhi Gold Price Today) పది గ్రాముల ధర 46 వేల 250 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 50 వేల 450గా ఉంది. అటు ముంబైలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 46 వేల 120 కాగా, 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47 వేల 120 రూపాయలుగా ఉంది. ఇక చెన్నైలో(Chennai Gold Price Today) 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 46 వేల 650 కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 49 వేల 350 రూపాయలుగా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 44 వేల 100 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 48 వేల 110 రూపాయలుగా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్‌లో(Hyderabad Gold Price Today) 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 44 వేల 100 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం ధర 48 వేల 110 రూపాయలుగా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 44 వేల 100 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 48 వేల 110 రూపాయలుగా ఉంది. అటు విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర 44 వేల 100 రూపాయలు కాగా...24 క్యారెట్ల బంగారం ధర 48 వేల 110 రూపాయలుగా ఉంది. 


Also read: BMW New Model Car: బీఎండబ్ల్యూ సరికొత్త మోడల్ కారు చూస్తే..చూపు తిప్పుకోలేరు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook