Gold and Silver Rate Today March 11: కొత్తగా బంగారం కొనాలని చూస్తున్నారా?.. అయితే మీకు ఒక శుభవార్త. ఉక్రెయిన్‌, రష్యాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా..  గత కొద్ది రోజులుగా బుల్లెట్ రైలు వేగంతో దూసుకెళ్తున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. కేవలం ఒక్కరోజులోనే బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. ఈరోజు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై ధర రూ.1,750 తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై రూ.1,600 తగ్గింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మార్చి 11న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,750కు పడిపోయింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ. 52,580కు చేరింది. మరోవైపు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,600 తగ్గడంతో.. మార్కెట్లో ధర రూ. 48,200గా ఉంది. బంగారం బాటలోనే వెండి కూడా నడిచింది. వెండి రేటు కూడా ఈ రోజూ భారీగా తగ్గింది. ఏకంగా రూ.2,600 తగ్గడంతో.. ఒక కిలోకు రూ. 74,100గా ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం. 


ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,200 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.52,580గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.48,200 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.52,580గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,850గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.53,290 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,200.. 24 క్యారెట్ల ధర రూ.52,580గా నమోదైంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.48,200 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.52,580గా ఉంది.


హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,200 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,580గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.48,200.. 24 క్యారెట్ల ధర రూ.52,580గా నమోదైంది. ఇక విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.48,200 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.52,580 వద్ద కొనసాగుతోంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.74,600లుగా ఉంది. 


Also Read: Jofra Archer: ఆర్చర్ జోస్యం మళ్లీ నిజమైంది.. పంజాబ్‌లో ఆప్‌ స్వీప్‌ చేస్తుందని ముందే తెలుసా?


Also Read: Radhe Shyam Review: అప్పట్లో శివ.. ఇప్పుడు రాధేశ్యామ్! ప్రభాస్ ఇక పాన్ ఇండియా స్టార్ కాదు..!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook