Gold Price Today: బంగారం ధరకు మళ్లీ రెక్కలొచ్చాయి. గత రెండు రోజులుగా తగ్గిన పసిడి మళ్లీ పరుగులు పెడుతోంది. రేటు పెరిగినా కొనుగోళ్లు మాత్రం ఆగడం లేదు. ఇవాళ తులం బంగారంపై రూ.900 వరకు ఎగబాకింది. గోల్డ్ బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. కిలో వెండిపై రూ.900 వరకు పెరిగింది. రాబోయేది పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం షాపులన్నీ కస్టమర్లతో  కిటకిటలాడుతున్నాయి. నవంబర్‌ 6వ తేదీన దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం. ఈ రేట్స్ (Gold Price on 06 November 2022) దేశీయ మార్కెట్లో ఉదయం ఆరు గంటలకు నమోదైనవి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశీయంగా బంగారం ధరలు:
>> దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర  రూ.47,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.51,440 వద్ద కొనసాగుతోంది. 
>> ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,280 ఉంది.
>> కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు  రూ.47,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,280 వద్ద కొనసాగుతోంది.
>> చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు  రూ.47,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర పసిడి ధర రూ.52,040 ఉంది.
>> బెంగళూరులో 22 క్యారెట్ల10 గ్రాముల పసిడి ధర రూ.47,050 ఉండగా, 24 క్యారెట్లు రూ.51,330 వద్ద కొనసాగుతోంది. 
>> కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.47,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,280 ఉంది.


తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు..
>> హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.51,110 ఉంది.
>> విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.47,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,280 వద్ద కొనసాగుతోంది.
>> విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,280గా ఉంది.


Also Read: Digital Rupee: డిజిటల్ కరెన్సీ అంటే ఏమిటి, క్రిప్టోకరెన్సీకు, డిజిటల్ రూపీకు తేడా ఏంటి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook