Digital Rupee: డిజిటల్ కరెన్సీ అంటే ఏమిటి, క్రిప్టోకరెన్సీకు, డిజిటల్ రూపీకు తేడా ఏంటి

Digital Rupee: ఇటీవలి కాలంలో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన డిజిటల్ రూపీ ప్రారంభం కానుంది. అసలు డిజిటల్ రూపీ అంటే ఏమిటి, ఎలా పనిచేస్తుంది, క్రిప్టోకరెన్సీతో పోలిస్తే ఏం తేడాలున్నాయో తెలుసుకుందాం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 6, 2022, 12:46 AM IST
Digital Rupee: డిజిటల్ కరెన్సీ అంటే ఏమిటి, క్రిప్టోకరెన్సీకు, డిజిటల్ రూపీకు తేడా ఏంటి

ఇండియాలో త్వరలో కార్యరూపం దాలుస్తున్న డిజిటల్ కరెన్సీ లేదా డిజిటల్ రూపీపైనే ఇప్పుడు చర్చ నడుస్తోంది. అసలు డిజిటల్ కరెన్సీ ఎలా ఉంటుంది, ఇండియాకు ఎలా ప్రయోజనకరం అనే వివరాలు పరిశీలిద్దాం..

డిజిటల్ కరెన్సీ అనేది సెంట్రల్ బ్యాక్ డిజిటల్ కరెన్సీ జారీ చేసే లీగల్ టెండర్ లాంటిది. ఇది కూడా క్రిప్టోకరెన్సీలానే బ్లాక్ ఛైన్ టెక్నాలజీతో పనిచేస్తుంది. డిజిటల్ రూపంలో సెంట్రల్ బ్యాంకు జారీ చేసే ఈ డిజిటల్ రూపీ..సాధారణ నోట్లకు సమాన విలువ కలిగి ఉంటుంది. ప్రభుత్వం జారీ చేసే డబ్బులకు బదులుగా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.

క్రిప్టోకరెన్సీకు డిజిటల్ రూపీకు తేడా ఏంటి

డిజిటల్ రూపీ అనేది సాధారణ రూపాయి కాగితంలాంటిదే. కానీ డిజిటల్ రూపంలో ఉంటుంది. మరి ప్రైవేట్ క్రిప్టోకరెన్సీతో పోలిస్తే డిజిటల్ రూపీ ఎలా భిన్నమైందనే ప్రశ్న ఉత్పన్నమౌతోంది. డిజిటల్ కరెన్సీ అనేది లీగల్ టెండర్ కాగా...మిగిలిన ప్రైవేట్ క్రిప్టోకరెన్సీ అలా కానే కాదు. ప్రైవేట్ క్రిప్టోకరెన్సీను డిజిటల్ రూపీతో ఎక్స్చేంజ్ చేయడానికి వీలుకాదు.

డిజిటల్ రూపీ వాడకం అనేది సాంప్రదాయ నగదు వ్యవస్థలానే గోల్డ్, ఫారెక్స్, ట్రెజరీ బిల్స్‌కు అనుసంధానమై ఉంటుంది. అయితే ప్రైవేట్ క్రిప్టోకరెన్సీకు ఇంటర్నల్ విలువ లేదు. 

డిజిటల్ రూపీ ఎలా పనిచేస్తుంది

డిజిటల్ రూపీ కూడా క్రిప్టోకరెన్సీ టెక్నాలజీనే వినియోగిస్తుంది. అదే బ్లాక్ ఛైన్ టెక్నాలజీ. బ్లాక్ ఛైన్ అనేది డీసెంట్రలైజ్డ్ డిజిటల్ లెడ్జర్‌గా చెప్పవచ్చు. ఇందులో బ్లాక్స్‌గా పిల్చుుకునేవాటిలో లావాదేవీల వివరాలు నమోదై ఉంటాయి. ఈ లావాదేవీలు పూర్తిగా పారదర్శకం. మార్చడానికి వీలు కాదు. అంటే ఇందులో ఉండే వివరాలు పూర్తిగా సురక్షితం. డిజిటల్ కరెన్సీ లావాదేవీల్ని మరింత సులభతరం చేస్తుంది. ఫిజికల్ కరెన్సీకు సమానంగా సురక్షితమైన ప్రత్యామ్నాయంగా ఉంటుంది. 

ఇండియాకు డిజిటల్ కరెన్సీ లాభదాయకమా కాదా

డిజిటల్ కరెన్సీ లాంచ్ చేయడంతో ఇండియా మరింత సమర్ధవంతమైన, తక్కువ ఖర్చుతో కూడిన ఆర్ధిక వ్యవస్థను కలిగి ఉంటుంది. భారత ఆర్ధిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలుస్తుంది. మార్కెట్‌లో నగదు చేరిక, ద్రవ్య నగదు లావాదేవీలు మరింత సమర్ధవంతంగా పనిచేస్తాయి. 

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిన్న అంటే నవంబర్ 1వ తేదీన డిజిటల్ రూపీ పైలట్ ప్రోగ్రాం ప్రారంభించింది. దీనికోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సి బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్ర బ్యాంక్, ఎస్ బ్యాంక్, ఐడీఎఫ్‌సి బ్యాంక్,హెచ్‌ఎస్‌బి వంటి 9 బ్యాంకుల్ని గుర్తించింది.

Also read: Aadhaar Card: ఆధార్ కార్డులో ఈ అప్‌డేట్ లేకపోతే..అన్నీ సమస్యలే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News