Gold Price Today: బంగారం ప్రియులకు కాస్త ఊరటనిచ్చే విషయమే. బంగారం ధరలు వరుసగా రెండవరోజు స్వల్పంగా తగ్గాయి. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతర్జాతీయ మార్కెట్, డాలర్ విలువ, రిజర్వ్ బ్యాంక్‌లో నిల్వ ఉన్న బంగారం వంటి చాలా అంశాల ఆధారంగా బంగారం ధరల్లో మార్పులు వస్తుంటాయి. మొన్నటి వరకూ పెరుగుతూ పోయిన బంగారం ధర వరుసగా రెండవరోజు స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. అయితే పెళ్లిళ్ల సీజన్ ఉండటంతో రానున్న రోజుల్లో మరింతగా పెరిగే అవకాశాలున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో బంగారం ధరలు ఇవాళ ఎలా ఉన్నాయో చూద్దాం.


దేశ రాజధాని నగరం ఢిల్లీలో అన్నింటికంటే ఎక్కువ ధర ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర(Gold Price Today)47 వేల 890 కాగా, 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 52 వేల 240గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 48 వేల 280 రూపాయలైతే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 49 వేల 280గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 46 వేల 210 రూపాయలు కాగా, 24 క్యారెట్ల పది గ్రామల బంగారం ధర 49 వేల 280గా ఉంది. ఇక కోల్‌కత్తాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 48 వేల 290 రూపాయలు కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 50 వేల 990గా ఉంది. మరోవైపు బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 45 వేల 740 రూపాయలు అయితే..24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 49 వేల 900గా ఉంది. కేరళలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 45 వేల 740 రూపాయలు కాగా, 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 49 వేల 9 వందలుగా ఉంది. 


తెలుగు రాష్ట్రాల్లో అయితే బంగారం ధర దాదాపు ఒకేలా ఉంది. హైదరాబాద్‌లో(Hyderabad Gold Price) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 45 వేల 740 రూపాయలు కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 49 వేలుగా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 45 వేల 740 రూపాయలైతే..24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 49 వేల 9 వందలుగా ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 45 వేల 740 రూపాయలు కాగా, 24 క్యారెట్ల ధర 49 వేల 9 వందలుగా ఉంది.


Also read: రిలయన్స్ ఇండస్ట్రీస్-సౌదీ ఆరామ్​కో డీల్​కు బ్రేక్​..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook