Gold Price Today 19 September 2022: దేశవ్యాప్తంగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత మూడు రోజులుగా తగ్గుతూ, పెరుగుతూ వచ్చిన గోల్డ్ రేట్లు (Gold Price Today) సోమవారం మాత్రం నిలకడగా ఉన్నాయి. ప్రతి రోజు బంగారం, వెండి ధరల్లో హెచ్చు తగ్గులు చోటుచేసుకుంటాయి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ద్రవ్యోల్బణం, కొవిడ్, వాణిజ్య యుద్ధాలు, అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరల్లో మార్పు వంటి చాలా రకాల అంశాలు పసిడి ధరలు ప్రభావం  చూపుతాయి. ఇవాళ దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ ధరలు సోమవారం ఉదయం దేశీయ మార్కెట్లో 6 గంటలకు నమోదైనవి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు:
>> ఢిల్లీలో 22 క్యారెట్ల 10 బంగారం ధర రూ.47,680 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.52,010గా ఉంది.
>> ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.45,950 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,130గా నమోదైంది. 
>> కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,950 కాగా... 24 క్యారెట్ల ధర రూ.50,130గా కొనసాగుతోంది. 
>> బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,000 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.50,180 ఉంది.
>> చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,620 వద్ద ఉంది.
>> కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,950 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.50,130 వద్ద కొనసాగుతోంది. 


తెలుగు రాష్ట్రాల్లో...
>> హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,130 వద్ద ఉంది.
>> విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,130 వద్ద కొనసాగుతోంది. 


Also Read: Money Making Tips: ఇంట్లో కూర్చుని ఆన్‌లైన్‌లో డబ్బులు ఎలా సంపాదించడం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook