Gold Price Today 23 August 2022: బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజు మార్పులు చోటుచేసుకుంటాయన్న విషయం తెలిసిందే. ఒక రోజు పసిడి ధర పెరిగితే, మరో రోజు తగ్గుతుంది.. ఇంకో రోజు మాత్రం స్థిరంగా ఉంటుంది. కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో పసిడి నిల్వ, డాలర్ విలువ, పలు దేశాల భౌతిక పరిస్థితులు లాంటి పరిణామాలు బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అయితే బంగారం ధరలు ఎంత పెరిగినా లేదా తగ్గినా వ్యాపారాలు మాత్రం జోరుగానే సాగుతాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవల పెరిగిన బంగారం ధరలకు బ్రేక్ పడింది. గత రెండు రోజులుగా స్థిరంగా ఉంటూ వచ్చిన పసిడి రేటు నేడు తగ్గింది. మంగళవారం (ఆగష్టు 23) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దేశీయ మార్కెట్లో రూ. 47,600లు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,930లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల తులం బంగారంపై రూ. 200.. 24 క్యారెట్ల ధరపై రూ. 220 తగ్గింది. దేశంలోని ప్రధాన పట్టణాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం. 


# ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,750 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 52,100గా ఉంది. 
# ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 47,600 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 51,930గా నమోదైంది. 
# చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,150గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 52,530 వద్ద కొనసాగుతోంది. 
# బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 47,650గా నమోదవగా.. 24 క్యారెట్ల ధర రూ. 51,980గా ఉంది. 
# కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,600 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 51,930గా ఉంది.
# హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 47,600 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 51,930గా ఉంది. 
# విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,600.. 24 క్యారెట్ల ధర రూ. 51,930గా నమోదైంది. 
# విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 47,600 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 51,930 వద్ద కొనసాగుతోంది. 


బంగారం బాటలోనే వెండి కూడా పయనించింది. ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి ధర రూ. 55,200లగా కొనసాగుతోంది. నిన్నటితో పోల్చుకుంటే వెండి ధరలో రూ. 400 తగ్గింది. ముంబైలో కిలో వెండి ధర రూ. 55,200లుగా ఉండగా..  చెన్నైలో రూ. 61,100లుగా ఉంది. బెంగళూరులో రూ. 61,100గా ఉండగా.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 61, 100గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా రూ. 61,100ల వద్ద కొనసాగుతోంది. 


Also Read: సడెన్ సర్‌ప్రైజ్.. విజయ్‌ దేవరకొండకు ఎంగేజ్‌మెంట్‌ అయిపొయింది! పాపం రష్మిక


Also Read: Horoscope Today 23 August 2022: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే.. ఆ రెండు రాశుల వారికి..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook