బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate Today) స్వల్పంగా పెరిగాయి. అదే సమయంలో వెండి ధరలు క్షీణిస్తున్నాయి. హైదరాబాద్‌ (Gold Price Today In Hyderabad), విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో తాజాగా బంగారం ధర రూ.160 మేర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.51,490కి చేరింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.150 పెరగడంతో ధర రూ.47,200 అయింది.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత కొన్ని రోజులుగా ఢిల్లీ మార్కెట్‌లో స్థిరంగా కొనసాగుతోన్న బంగారం ధరలు (Gold Rate in Delhi) తాజాగా అతి స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములపై రూ.20 పెరగడంతో ధర రూ.54,120 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,610గా కొనసాగుతోంది.



గత కొన్ని రోజులుగా బులియన్ మార్కెట్‌లో నిన్న భారీగా పెరిగిన వెండి ధరలు (Silver Rate in India) తాజాగా ఓ మోస్తరుగా తగ్గాయి. తాజాగా వెండి ధర రూ.500 మేర దిగొచ్చింది. దీంతో 1 కేజీ వెండి ధర రూ.63,000కి పడిపోయింది. దేశ వ్యాప్తంగా వెండి ఇదే ధరలో మార్కెట్ అవుతుంది.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe