బంగారం ధరలు (Gold Rate Today) బులియన్ మార్కెట్‌లో భారీగా పెరిగాయి. నిన్న పెరిగిన వెండి ధరలు నేడు పతనమయ్యాయి. హైదరాబాద్‌ (Gold Price Today In Hyderabad), విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.370 మేర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.51,920కి చేరింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,600 అయింది.



 


ఢిల్లీ మార్కెట్‌లో ఇటీవల బంగారం ధరలు (Gold Rate in Delhi) వరుసగా పెరుగుతున్నాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపై ఏకంగా రూ.1,370 మేర పెరగడంతో  10 గ్రాముల ధర రూ.54,150కి చేరింది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం రూ.350 పెరగడంతో 10 గ్రాముల ధర రూ.49,650కి పుంజుకుంది.



 


బులియన్ మార్కెట్‌లో నిన్న స్వల్పంగా పెరిగిన వెండి ధరలు (Silver Rate in India) నేడు భారీగా దిగొచ్చాయి. తాజాగా బులియన్ మార్కెట్‌లో వెండి ధర రూ.700 మేర తగ్గింది. దీంతో ప్రస్తుతం 1 కేజీ వెండి ధర రూ.61,200కు పడిపోయింది.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe