బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate Today) దిగొచ్చాయి. వెండి సైతం పసిడి బాటలోనే పయనిస్తూ ధర తగ్గింది. హైదరాబాద్‌ (Gold Price Today In Hyderabad), విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.530 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.52,380 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారంపై రూ.500 తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.48,020కి దిగొచ్చింది. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లోనూ బంగారం ధరలు (Gold Rate in Delhi) దిగొచ్చాయి. తాజాగా రూ.440 మేర పసిడి ధర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.53,350 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,900కి పతనమైంది.



 


బులియన్ మార్కెట్‌లో వెండి ధర (Silver Rate in India) మరోసారి క్షీణించింది. తాజాగా వెండి ధర రూ.510 మేర తగ్గింది. ప్రస్తుతం 1 కేజీ వెండి ధర రూ.60,700కి పడిపోయింది. దేశ వ్యాప్తంగా వెండి ఇదే ధర వద్ద మార్కెట్ అవుతుంది. పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపిస్తాయి.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe