Gold Price Today: కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఎట్టకేలకు దిగివచ్చాయి. వరుసగా రెండో రోజు కూడా పసిడి ధరలు తగ్గాయి. దీంతో ఇవాళ గోల్డ్ కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉంది. క్రితం రోజుతో పోలిస్తే 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు సుమారు రూ.70, 24 క్యారెట్ల పసిడి ధర గ్రాముకు దాదాపు రూ.90 తగ్గినట్లయింది. మనలో చాలామంది పేద, మిడిల్ క్లాస్ ప్రజలే ఎక్కువ. భవిష్యత్తులో బంగారమే ఆస్తి అవుతుందనే ఉద్దేశంతో రేటు తగ్గినప్పుడల్లా వీరు కొనుగోలు చేస్తూ ఉంటారు.  ధనవంతులు మార్కెట్లో ఏవైనా కొత్త మోడల్స్ వస్తే వాటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతారు. ఇవాళ కిలో వెండి ధర రూ.64,000గా ఉంది. తాజాగా ధరలు తగ్గిన నేపథ్యంలో దేశంలోని ప్రధాన నగరాలతోపాటు తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవని గుర్తించుకోండి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు:
>> హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,900 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,160 వద్ద కొనసాగుతోంది.
>> విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,900గా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,160గా ఉంది.
>>విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.46,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,160 వద్ద కొనసాగుతోంది. 


దేశంలోని ప్రధాన నగరాల్లో...
>> ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,330 వద్ద ఉంది.
>> ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,160 వద్ద కొనసాగుతోంది.
>> చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.47,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,710గా ఉంది.


Also Read: Multibagger Share: కేవలం 4 రూపాయల షేర్..ఇప్పుడు 2 కోట్లు, ఎలా సాధ్యమైంది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://bit.ly/3P3R74U  


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook