Multibagger Share: కేవలం 4 రూపాయల షేర్..ఇప్పుడు 2 కోట్లు, ఎలా సాధ్యమైంది

Multibagger Share: షేర్ మార్కెట్‌లో కొన్ని కంపెనీల షేర్లు ఊహించని లాభాల్ని ఆర్జిస్తుంటాయి. మరి కొన్ని షేర్ల రేట్లు అమాంతం పెరిగిపోతుంటాయి. అలాంటిదే ఓ షేర్ ఇది. ఇన్వెస్టర్లకు అంతులేని లాభాల్ని తెచ్చిపెట్టింది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 11, 2022, 11:01 PM IST
Multibagger Share: కేవలం 4 రూపాయల షేర్..ఇప్పుడు 2 కోట్లు, ఎలా సాధ్యమైంది

కేవలం 4 రూపాయలు పెట్టి కొన్ని షేర్ ఇప్పుడు ఇన్వెస్టర్లను కోటీశ్వరుల్ని చేసేసింది. నాడు పెట్టిన లక్షరూపాయల పెట్టుబడి ఇప్పుడు 2 కోట్లుగా మారింది. షేర్ మార్కెట్‌లో ఇలాంటి మల్టీబ్యాగర్ స్టాక్స్ ఊహించని లాభాలు ఆర్జిస్తున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఇప్పుడిక్కడ చర్చిస్తున్నది ప్రముఖ ప్రైవేట్ ఇంటర్నేషనల్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ షేర్ గురించి. బ్యాంకింగ్ స్టాక్ జాబితాలో అద్భుతమైన షేర్ ఇది. 23 ఏళ్ల క్రితం మార్కెట్‌లో ఈ షేర్ విలువ కేవలం 3 రూపాయల 38 పైసలుంది. ఇవాళ ఈ షేర్ విలువ 785 రూపాయలైంది. అంటే ఇన్వెస్టర్లకు 23 వేల శాతం రిటర్న్ అందించిన షేర్ ఇది.

గత ఐదేళ్లలో ఈ షేర్ పరిస్థితి

ఈ మల్టీబ్యాగర్ స్టాక్ గత ఐదేళ్లలో దాదాపు 48 శాతం రిటర్న్ ఇచ్చింది. 5 ఏళ్లకు ముందు ఎన్ఎస్ఈలో ఈస్టాక్ విలువ 529 రూపాయలుంది. ఇప్పుడు పెరిగి 785 రూపాయలకు చేరుకుంది. అక్టోబర్ 11 నాటికి ఈ షేర్ 785 రూపాయలైంది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ట ధర 866 రూపాయలుండగా..52 వారాల కనిష్ట ధర 618 రూపాయలుంది.

పదేళ్లలో ఎంతలాభం

పదేళ్ల క్రితం ఈ షేర్‌‌పై మీరు 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టుంటే..ఇవాళ ఆ షేర్ మీకు 3 లక్షల 27 వేల రూపాయల రిటర్న్ ఇచ్చుండేది. కరోనా మహమ్మారి కాలంలో ఈ షేర్ చాలావరకూ పడిపోయింది. ఆ తరువాత తిరిగి పుంజుకోసాగింది.

లక్ష రూపాయలు 2 కోట్లుగా మారడం

1999 జనవరి 1న ఈ స్టాక్‌లో 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టుంటే ఇప్పుడు ఆ విలువ కోట్లలో ఉండేది. ఎందుకంటే ఆ సమయంలో ఈ స్టాక్ విలువ కేవలం 3 రూపాయల 38 పైసలు మాత్రమే ఉంది. అంటే అప్పుడు ఆ సమయంలో 1 లక్ష రూపాయలతో యాక్సిస్ బ్యాంక్ షేర్లు కొనుగోలు చేసుంటే..29,585 షేర్లు లభ్యమయ్యేవి. ఇప్పుడదే షేర్ విలువ 785 రూపాయలవడంతో..మీ లక్ష రూపాయల పెట్టుబడి కాస్తా ఇప్పుడు 2 కోట్ల 32 లక్షల 24 వేల రూపాయలై ఉండేది. 

Also read: SBI Home Loans: ఎస్బీఐ హోమ్ లోన్ వడ్డీ రేట్లపై డిస్కౌంట్ ఆఫర్స్, జనవరి వరకే అవకాశం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News