Gold Price today: బంగారం ధరలు ఎప్పటికప్పుడు వివిధ రకాల పరిస్థితుల్ని బట్టి మారుతుంటుంది. దేశవ్యాప్తంగా బంగారం ధరలు నిన్నటితో పోలిస్తే స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బంగారం ధరలు మార్కెట్ పరిస్థితుల్ని బట్టి మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం డిమాండ్, లభ్యత, రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వలు, డాలర్ విలువ వంటి పరిస్థితుల ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతుంటుంది. నిన్నటితో పోలిస్తే బంగారం ధరలు కొన్ని ప్రాంతాల్లో స్థిరంగా ఉండగా, కొన్ని ప్రాంతాల్లో తగ్గింది. బంగారం ధరలపై ఒమిక్రాన్ వేరియంట్ కూడా ప్రభావం చూపిస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు(Gold Price)ఇలా ఉన్నాయి.


దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం(Delhi Gold Price)10 గ్రాముల ధర 46 వేల 910 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర 51 వేల 170 రూపాయలుగా ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 46 వేల 820 రూపాయలైతే..24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 47 వేల 820 రూపాయలుగా ఉంది. తమిళనాడు రాజధాని చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర49 వేల100 రూపాయలుగా ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 47 వేల 100 రూపాయలైతే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 8 వందలుగా ఉంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 44 వేల 760 రూపాయలు కాగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 48 వేల 830 రూపాయలుగా ఉంది. కేరళలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 44 వేల760 రూపాయలుండగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 48 వేల 830గా ఉంది.


ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో(Hyderabad Gold Price) 22 క్యారెట్ల  బంగారం 10 గ్రాముల ధర 44 వేల760  రూపాయలైతే..24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 48 వేల 830 రూపాయలుంది.విజయవాడలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 44 వేల 760 రూపాయలు కాగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 48 వేల 830 రూపాయలుగా ఉంది. విశాఖలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.


Also read: Motorola Moto G51 mobile: ఇండియాలో లాంచ్ అవుతున్న మోటోరోలా మోటో జి51 మొబైల్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook