Gold Price Today July 18: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధర! హైదరాబాద్‌లో నేటి ధరలు ఇవే
July 18th 2022, Today Gold and Silver Prices In Hyderabad: హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 46,190 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 50,390గా ఉంది.
Gold and Silver Price Today July 18 2022: బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు చోటుచేసుకుంటుంటాయన్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా బంగారంకు ఉన్న డిమాండ్.. కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో పసిడి నిల్వ.. డాలర్ విలువ.. వివిధ దేశాల భౌతిక పరిస్థితులు లాంటి పరిణామాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి. అయితే పసిడికి మహిళలు అధిక ప్రాధాన్యతనిస్తారు కాబట్టి.. ధరలు పెరిగినా తగ్గినా వ్యాపారాలు మాత్రం జోరుగానే కొనసాగుతాయి.
గత కొన్ని రోజలుగా బంగారం ధరలు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. గత మూడు రోజులుగా కాస్త తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు.. నేడు కూడా స్వల్పంగా తగ్గాయి. సోమవారం (జులై 18) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దేశీయ మార్కెట్లో రూ. 46,190లు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,390లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల తులం బంగారంపై రూ. 10.. 24 క్యారెట్ల ధరపై రూ. 10 తగ్గింది. మరోవైపు వెండి ధరలు కూడా తగ్గాయి. ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి ధర రూ. 55,600లుగా ఉంది.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,190 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 50,390గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 46,190 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 50,390గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,260గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 50,470 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,290.. 24 క్యారెట్ల ధర రూ. 50,100గా నమోదైంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ. 46,190 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 50,390గా ఉంది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 46,190 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 50,390గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ. 46,190.. 24 క్యారెట్ల ధర రూ. 50,390గా నమోదైంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 46,190 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 50,390 వద్ద కొనసాగుతోంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 60,700లుగా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా రూ. 60,700లుగా కొనసాగుతోంది.
Also Read: Horoscope Today July 18 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ఊహించిన ధన లాభం!
Also Read: Rishabh Pant Century: పంత్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం! సిరీస్ కైవసం
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook