Gold and Silver Price Today 2022 July 25: బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు చోటుచేసుకుంటుంటాయన్న విషయం తెలిసిందే. ఒక రోజు రేట్లు పెరిగితే, మరో రోజు తగ్గుతాయి.. ఇంకోరోజు స్థిరంగా ఉంటాయి. కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో పసిడి నిల్వ, డాలర్ విలువ, వివిధ దేశాల భౌతిక పరిస్థితులు లాంటి పరిణామాలు పసిడి ధరలపై ప్రభావం చూపుతాయి. అయితే పసిడి ధరలు ఎంత పెరిగినా లేదా తగ్గినా వ్యాపారం మాత్రం జోరుగానే ఉంటుంది. ఇక పెళ్లిళ్ల సీజన్‌లో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవలి కాలంలో బంగారం ధరలు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. గత 10 రోజులుగా తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు.. నిన్న పెరిగాయి. ఈరోజు అవే ధరలు కొనసాగుతున్నాయి. సోమవారం (జులై 25) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దేశీయ మార్కెట్లో రూ. 46,900లు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,160లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల తులం బంగారంపై.. 24 క్యారెట్ల ధరపై ఎలాంటి మార్పు లేదు.


ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,900 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 51,160గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 46,900 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 51,160గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,900గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 51,230 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,950.. 24 క్యారెట్ల ధర రూ. 51,210గా నమోదైంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ. 46,900 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 51,160గా ఉంది.


హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 46,900 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 51,160గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ. 46,900.. 24 క్యారెట్ల ధర రూ. 51,160గా నమోదైంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 46,900 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 51,160 వద్ద కొనసాగుతోంది. మరోవైపు ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి ధర రూ. 55,100లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 61,200లుగా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా రూ. 61,200లుగా కొనసాగుతోంది. 


Also Read: రెచ్చిపోయిన అక్షర్ పటేల్.. ఉత్కంఠ పోరులో భారత్ విజయం! విండీస్‌పై సిరీస్‌ కైవసం


Also Read: Horoscope Today July 25 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారు ఊహించని శుభవార్త వింటారు!   


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.