Gold Price Today: వరుసగా రెండో రోజు పెరిగిన బంగారం ధరలు... ఏయే నగరాల్లో ఎంత పెరిగిందంటే..
Gold Price Today September 10th 2022 : బులియన్ మార్కెట్లో ఇవాళ 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.4675ఉంది. 24 క్యారెట్ల 1 గ్రాముల బంగారం ధర రూ.5100గా ఉంది.
Gold Price Today September 10th 2022 : బంగారం ఇప్పుడు చాలామందికి పెట్టుబడి ఆప్షన్. దీర్ఘకాలంలో బంగారంపై పెట్టుబడి మంచి లాభాలను ఇస్తుంది. అందుకే చాలామంది బంగారం ధర కాస్త తగ్గగానే ఎంతో కొంత బంగారాన్ని కొనుగోలు చేయాలనుకుంటారు. అందుకే ఎప్పటికప్పుడు బంగారం ధరలను గమనిస్తుంటారు. ప్రస్తుతం బంగారం ధరల ట్రెండ్ గమనిస్తే వరుసగా స్వల్ప హెచ్చు తగ్గులు నమోదవుతున్నాయి. ఇవాళ వరుసగా రెండో రోజు బంగారం ధర స్వల్ప మేర పెరిగింది. నిన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.250, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.270 మేర పెరిగిన ధర ఇవాళ రూ.100, రూ.110 మేర పెరిగింది. తాజాగా పెరిగిన ధరలతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.46,650 నుంచి రూ.46,750కి పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,890 నుంచి రూ.51 వేలకు పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలను ఇప్పుడు పరిశీలిద్దాం..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు:
హైదరాబాద్‌తో పాటు ఏపీలోని విజయవాడ, విశాఖపట్నంలలోనూ ఇవాళ బంగారం ధరలు రూ.100, రూ.110 మేర పెరిగాయి. ప్రస్తుతం ఈ మూడు నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,750, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,000గా ఉంది.
దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,900గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,150గా ఉంది.
దేశ ఆర్థిక రాజధాని ముంబైతో పాటు కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,000గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,680గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,010గా ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,800గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,050గా ఉంది.
మహారాష్ట్రలోని పుణే, గుజరాత్‌లోని వడోదరా నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,780 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,030గా ఉంది.
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,750గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,000గా ఉంది.
గడిచిన 10 రోజుల్లో నాలుగుసార్లు తగ్గిన బంగారం ధర ఐదుసార్లు పెరిగింది. సెప్టెంబర్ 1, 7 తేదీల్లో రూ.540 మేర ధర దిగొచ్చింది. మిగతా తేదీల్లో స్వల్ప హెచ్చు తగ్గులు నమోదయ్యాయి. ఈ నెల ప్రారంభంతో పోలిస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.250, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.270 మేర పెరిగింది. ధారణంగా బంగారం ధరలపై జీఎస్టీ, టీసీఎస్, ఇతరత్రా పన్నుల కారణంగా వివిధ నగరాల్లోని ధరల్లో స్వల్ప తేడాలు ఉంటాయి. కస్టమర్స్ కచ్చితమైన ధర కోసం నేరుగా స్థానిక జ్యువెలరీ వ్యాపారులను సంప్రదించండి. అంతర్జాతీయ మార్కెట్, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, డాలరుతో రూపాయి మారకం విలువ, దేశాల మధ్య సంబంధాలు తదితర కారణాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తుంటాయి.
ALSO READ : Horoscope Today September 10th 2022: నేటి రాశి ఫలాలు... ఈ రాశి వారు ఏ పని చేట్టినా ప్రతికూలత ఎదురవుతుంది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook