Gold Price Today: బంగారం ప్రియులకు ముఖ్యంగా మహిళలకు ఇది బ్యాడ్‌న్యూస్. బంగారం ధర మార్కెట్‌లో మరోసారి పెరిగింది. ఏకంగా 5 వందల వరకూ ధర పెరగడంతో మారిన బంగారం ధరలిలా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు చోటుచేసుకుంటుంటాయి. ఒక్కోసారి తగ్గితే..మరోసారి పెరుగుతుంటుంది. డాలర్ ధరకు అనుగుణంగా లేదా అంతర్జాతీయ బంగారం మార్కెట్ ప్రకారం ధరల్లో మార్పులు వస్తుంటాయి. కరోనా సెకండ్ వేవ్ అనంతరం తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు(Gold and Silver Prices)ఇటీవలికాలంలో క్రమంగా పెరుగుతున్నాయి. పండుగలప్పుడైతే షాక్ ఇస్తున్నాయి. ఇక గత 4 రోజుల్నించి బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 47 వేల 270 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర 48 వేల 270గా కొనసాగుతోంది. తులం బంగారంపై 510 వరకూ పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ఉదయం ఆరు గంటల వరకు నమోదైన రేట్ల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.


ప్రధాన నగరాల్లో బంగారం ధరలు(Gold Price Today)


దేశ రాజధాని ఢిల్లీలో(Delhi Gold Price) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 47 వేల 200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 50 వేల 100గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 47వేల 270 కాగా..24 క్యారెట్ల 10 గ్రాముల ధర 48 వేల 270గా ఉంది. తమిళనాడు రాజధాని చెన్నైలో(Chennai Gold Price) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 45 వేల 380 అయితే..24 క్యారెట్ల 10 గ్రాముల ధర 49 వేల 510గా ఉంది. ఇక కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 47 వేల 400 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 50 వేల 100గా ఉంది. బెంగళూరులో(Bengaluru Gold Price) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 45 వేల 50 అయితే.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 49 వేల 150 ఉంది.కేరళలో 22 క్యారెట్లు పది గ్రాముల బంగారం ధర 45 వేల 50 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 49 వేల150గా ఉంది. 


ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంచుమించు అలాగే ఉంది. హైదరాబాద్‌లో(Hyderabad Gold Price) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 45 వేల 50 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 49 వేల 150గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 45 వేల 50 ఉండగా, 24 క్యారెట్ల ధర 49 వేల 150గా ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 45 వేల 50 ఉండగా, 24 క్యారెట్ల ధర 49 వేల 150గా ఉంది.


Also read: 5G Network: ఇండియాలో 5జీ నెట్‌వర్క్ మరింత ఆలస్యం కానుందా, కారణమేంటి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook