Gold Price Today: అడ్డూ అదుపు లేకుండా పెరుగుతున్న బంగారం, వెండి ధరలతో సామాన్యుడితోపాటు మధ్య తరగతి ప్రజలు కొనలేని పరిస్థితి. రోజురోజుకు పెరుగుతున్న ధరలతో బంగారం, వెండి ఆకాశన్నంటుతోంది. ఈ క్రమంలో ధరలకు కొంత బ్రేక్‌ పడింది. ఒక్కరోజే భారీగా బంగారం ధర తగ్గింది. దీంతో ప్రజలకు చాలా రోజుల తర్వాత ఊరట లభించింది. అనూహ్యంగా రూ.1,200 మేర బంగారం తగ్గడం విశేషం. మే 23 గురువారం రోజు తులం (12 గ్రాములు) బంగారం ధర రూ.1,200 మేర తగ్గినట్లు బిజినెస్‌ వర్గాలు వెల్లడించాయి.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Advise To AC Users: ఏసీ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వ చిట్కాలు.. విద్యుత్‌ బిల్లు ఆదా.. సురక్షిత ఆరోగ్యం ఇలా


 


తగ్గిన ధరతో హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర రూ.వెయ్య తగ్గి రూ.67,300 లకు దిగి వచ్చింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,090 తగ్గి రూ.73,420 వద్దకు చేరుకుంది. హైదరాబాద్‌, విశాఖపట్టణం, విజయవాడతోపాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో ఈ ధరలు నమోదయ్యాయి.

Also Read: Google Pay Close: అలర్ట్.. గూగుల్‌ పే సేవలు బంద్‌.. ఎందుకో తెలుసా?


ఇక వెండి విషయానికి వస్తే వెండి ధర కూడా భారీగా తగ్గింది. కిలో వెండి ధర అనూహ్యంగా రూ.3,300 మేర తగ్గింది. తగ్గిన ధరతో హైదరాబాద్‌లో కిలో వెండి రూ.97,000 కు చేరుకుంది. దేశవ్యాప్తంగా తగ్గిన ధరలతో ఆయా పట్టణాల్లో ధరల్లో కొంత వ్యత్యాసాలు ఉంటాయి.


 


దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఇలా..
ఢిల్లీ: 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.వెయ్యి తగ్గి రూ.67,450కు చేరుకోగా.. 24 క్యారెట్ల బంగారం రూ.1,090 తగ్గి రూ.73,570కు చేరుకుంది.
ముంబై: దేశ ఆర్థిక రాజధానిలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.67,300కు చేరుకోగా.. 24 క్యారెట్ల బంగారం రూ.1,090 తగ్గి రూ.73,420కు చేరుకుంది.
చెన్నై: 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,100 తగ్గి రూ.67,500కు చేరుకోగా.. 24 క్యారెట్ల బంగారం రూ.1,090 తగ్గి రూ.73,640 వద్దకు చేరుకుంది.
బెంగళూరు: 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.67,300కు చేరుకోగా.. 24 క్యారెట్ల బంగారం రూ.1,090 తగ్గి రూ.73,420కు చేరుకుంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter