Todays Gold Rate: బంగారం ధర మరోసారి స్వల్పంగా తగ్గింది. గత కొద్దిరోజులుగా బంగారం ధరలో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బంగారం ధరలు ప్రతిరోజూ ఎప్పటికప్పుడు మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం డిమాండ్, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, డాలర్ విలువ, వివిధ దేశాల మధ్య భౌతిక పరిస్థితులు, కరోనా మహమ్మారి వంటివి ప్రధానంగా ప్రభావం చూపిస్తుంటాయి. అందుకే బంగారం ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.


దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం 22 క్యారెట్ల ధర 46 వేల 2 వందలు కాగా, 24 క్యారెట్ల బంగార ధర 50 వేల 630 రూపాయలుంది. ఇక ముంబైలో 10 గ్రాముల బంగారం 22 క్యారెట్ల ధర 46 వేల 2 వందలుండగా, 10 గ్రాముల బంగారం 24 క్యారెట్ల ధర 50 వేల 4 వందలుగా ఉంది. చెన్నైలో 10 గ్రాముల బంగారం 22 క్యారెట్ల ధర 46 వేల 650 రూపాయలుగా ఉంది. ఇక పది గ్రాముల బంగారం 24 క్యారెట్ల ధర 50 వేల 850 రూపాయలుగా ఉంది.ఇక బెంగళూరులో పది గ్రాముల బంగారం 22 క్యారెట్ల ధర 46 వేల 2 వందలు కాగా, 10 గ్రాముల బంగారం 24 క్యారెట్ల ధర 50 వేల 4 వందలుగా ఉంది. 


హైదరాబాద్ (Hyderabad Gold Rate) నగరంలో పది గ్రాముల బంగారం 22 క్యారెట్ల ధర 46 వేల 2 వందలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 50 వేల 4 వందలుగా ఉంది. ఇక విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 10 గ్రాముల బంగారం 22 క్యారెట్ల ధర 46 వేల 2 వందలుండగా,10 గ్రాముల బంగారం 24 క్యారెట్ల ధర 50 వేల 4 వందలకు చేరింది. 


Also read: Instagram Money: ఇన్ స్టాగ్రామ్ లో ఐదుగురు ఫాలోవర్స్ ఉంటే చాలు రూ. లక్షల్లో సంపాదన!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook