Instagram Money: ఇన్ స్టాగ్రామ్ లో ఐదుగురు ఫాలోవర్స్ ఉంటే చాలు రూ. లక్షల్లో సంపాదన!

Instagram Money: ఖాళీ సమయాల్లో కాలక్షేపం కోసం మనలో చాలామంది సోషల్ మీడియాను ఆశ్రయిస్తుంటారు. అందులో తమకు సంబంధించిన విషయాలతో పాటు అనేక ఆసక్తికర విశేషాలను పంచుకుంటుంటారు. అయితే ఆ సోషల్ మీడియాలో ఒక భాగమైన ఇన్ స్టాగ్రామ్ లో డబ్బు సంపాదించవచ్చని మీకు తెలుసా? లేదంటే ఇన్ స్టాగ్రామ్ లో డబ్బు సంపాదించేందుకు ఉన్న మార్గాలను మీరు తెలుసుకోండి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 16, 2022, 01:24 PM IST
  • ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించేందుకు ఉపాయం!
  • ఇన్ స్టాగ్రామ్ ద్వారా డబ్బును ఆర్జించేందుకు అవకాశం
  • ఆన్ లైన్ షాపింగ్, ప్రొడక్ట్స్ వివరాలను పోస్ట్ చేస్తే లక్షల్లో సంపాదన
Instagram Money: ఇన్ స్టాగ్రామ్ లో ఐదుగురు ఫాలోవర్స్ ఉంటే చాలు రూ. లక్షల్లో సంపాదన!

Instagram Money: సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ అయిన ఇన్ స్టాగ్రామ్ ఇటీవలీ కాలంలో విపరీతమైన ప్రాచుర్యం పొందింది. ఫేస్‌బుక్ యాప్ తర్వాత అంత కన్నా వేగంగా ప్రసిద్ధి చెందిన ఫొటో షేరింగ్ యాప్ ఇన్ స్టాగ్రామ్. అయితే ఇప్పుడు ఇందులో కేవలం ఫొటోలను పోస్ట్ చేయడమే కాకుండా.. ఈ యాప్ ద్వారా డబ్బును సంపాదించేందుకు అవకాశం ఉంది. ఇప్పటికే కొందరు నెటిజన్లు డబ్బును సంపాదిస్తున్నారు కూడా! ఇన్ స్టాగ్రామ్ యాప్ లో మీ జీవితంలోని ప్రత్యేక క్షణాలను పంచుకోవడం సహా కొన్ని వ్యాపారాలను లేదా ఉత్పత్తలకు ప్రచారం కల్పించడం ద్వారా డబ్బును సంపాదించవచ్చు. అలా ఇన్ స్టాగ్రామ్ లో డబ్బు సంపాదించేందుకు ఉన్న మార్గాలను ఈ రోజు చెప్పబోతున్నాం. 

ఫాలోవర్స్ అవసరం లేదు!

సోషల్ మీడియాలో డబ్బు సంపాదించాలంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉండాలని చెబుతుంటారు. కానీ, ఇన్ స్టాగ్రామ్ లో ఆ అవసరం లేదు. ఏదైనా బ్రాండ్ లేదా కంపెనీని ప్రచారం చేయడం వల్ల కూడా డబ్బును సంపాదించవచ్చు. ఇన్ స్టాగ్రామ్ లో ఆయా బ్రాండ్స్ కు ప్రచారం కల్పించడం సహా మీ ఉత్పత్తులను విక్రయించడం వల్ల డబ్బును ఆర్జించవచ్చు. 

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ గా..

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారడం డబ్బు సంపాదించేందుకు ఉత్తమ ఎంపికగా పరిగణిస్తున్నారు. దీంతో మీ ఖాతాకు కొన్ని ప్రొడక్ట్స్ ప్రచారం కోసం వస్తాయి. వాటి నుంచి డబ్బు పొందవచ్చు. అయితే అందుకు మీ ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో కనీసం 5 మంది ఫాలోవర్స్ ఉండాలి. దీంతో పాటు ఫాలోవర్స్ తో ఎంగేజ్ మెంట్ రేట్ కూడా ఎక్కువగా ఉండాలి. అనేక బ్రాండ్స్ కు మీ ఖాతాలో ప్రచారం చేయడం ద్వారా మీ ఆదాయం పెరుగుతుంది. 

రిఫరెన్స్ లింక్స్ ద్వారా సంపాదన

మీ దగ్గరకు వచ్చిన ప్రొడక్ట్ ఏదైనా మీరు రిఫర్ చేస్తే.. ఆ లింక్ ద్వారా ఎవరైనా లావాదేవీలు జరిపితే, దాని నుంచి కూడా మీరు డబ్బు సంపాదించవచ్చు. ఆ స్పాన్సర్ పోస్ట్ నుంచి మీరు నేరుగా డబ్బు పొందుతారు. ఈ ప్రక్రియ అంతా మొబైల్ యాప్స్ లో రిఫర్ లింగ్ మాదిరి జరుగుతుంది. 

ఆన్ లైన్ షాపింగ్ పేజీని క్రియేట్ చేయండి

ఇన్ స్టాగ్రామ్ లో మీరు ఏదైనా షాపింగ్ పేజీని కూడా సృష్టించవచ్చు. ఈ- కామర్స్ వెబ్ సైట్ లా.. మీరు కూడా ఇన్ స్టాగ్రామ్ లో స్వంత పేజీని క్రియేట్ చేసుకోవచ్చు. ఆ ఖాతాను అనుసరించే ఫాలోవర్స్ మీ ప్రొడక్ట్స్ ను కొంటారు. అలా కొనడం వల్ల మీ ఆన్ లైన్ షాపింగ్ పేజీకి ఫాలోవర్స్ పెరగడం సహా డబ్బు వస్తుంది. 

ప్రొడక్ట్స్ వివరాలను ప్రచారం చేసి..

ఇన్ స్టాగ్రామ్ లో అనేక ఉత్పత్తుల సమాచారాన్ని మీ ఫాలోవర్స్ తో పంచుకోవడం ద్వారా డబ్బును ఆర్జించవచ్చు. ఆ ప్రొడక్ట్స్ కు సంబంధించిన ప్రోగ్రామ్స్ లేదా ఫీచర్స్ ను మీరు ఎక్స్ ప్లేయిన్ చేయడం ద్వారా.. ప్రీమియం సమాచార ఉత్పత్తుల నుంచి గరిష్టంగా 100 డాలర్లు (రూ.7,521) సంపాదించే అవకాశం ఉంది.  

Also Read: Nokia G11 Launch: నోకియా స్మార్ట్ ఫోన్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే మూడు రోజులు వస్తుంది!

Also Read: LIC Jeevan Labh Policy: రూ.262 పెట్టుబడితో రూ.20 లక్షల వరకు లాభం పొందండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News