iphone 13 Croma Independence Day Offer: వచ్చే నెల ఆపిల్ యొక్క కొత్త సిరీస్‌ ఫ్లాగ్షిప్‌ స్మార్ట్‌ ఫోన్, ఐఫోన్ 14 సిరీస్‌ లాంచ్ కానుంది. ఈసిరీస్‌ కోసం మొబైల్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీటిని కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఐఫోన్ 13 యొక్క 128 జీబీ వేరియంట్‌ను రూ.3 వేల కంటే తక్కువ ధరకు తీసుకెళ్లే అవకాశం కల్పిస్తున్నారు. ఈ ఆఫర్‌ను అమెజాన్‌, ఫ్లిప్ కార్డులో కాకుండా సరికొత్త ప్లాట్‌పామ్‌తో వినియోగదారుల ముందుకు తెస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐఫోన్‌ 13 స్మార్ట్‌ ఫోన్‌ను క్రోమా నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. క్రోమా ఇండిపెండెన్స్‌ డే సేల్‌గా దీనికి నామాకరణం చేశారు. ఐఫోన్‌ 128 జీబీ ఐఫోన్ 13 ధర రూ.79 వేల 900గా ఉంది. దీనికి 11 శాతం డిస్కౌంట్‌తో రూ.70 వేల 990గా విక్రయిస్తున్నారు. రూ.3 వేల కంటే తక్కువ ధరతో ఫోన్‌ను ఇంటికి తీసుకెళ్లే వెసులుబాటును ఐఫోన్‌ కల్పించింది. ఇలా ఐఫోన్‌ కావాలంటే నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌ను మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది.


క్విక్ ఈఎంఐ కార్డుతో ఐఫోన్‌ 13 తీసుకుంటే..నెలకు రూ.2 వేల 958 చొప్పున ఈఎంఐ చెల్లించే అవకాశం ఉంది. ఈ ఆఫర్‌ను మీరు 24 గంటల్లో వినియోగించుకోవాలని ఐఫోన్‌ విజ్ఞప్తి చేసింది. టాటా యొక్క కొత్త పేమెంట్ యాప్, టాటా న్యూ యాప్‌ ద్వారా క్విక్ ఈఎంఐ కార్డు కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో రూ. 10 వేల నుంచి రూ.2 లక్షల వరకు క్రెడిట్ లిమిట్ ఇవ్వబడుతుంది. దీనిని ఈఎంఐ క్రెడిట్ కార్డుగా పిలుస్తారు. 


ఈకార్డు సహాయంతో క్రోమా నుంచి ఐఫోన్‌ 13 యొక్క ఈఎంఐ చెల్లించవచ్చు. ఐఫోన్‌ 13లో ఎన్నో అద్భుత ఫీచర్లు ఉన్నాయి. ఈఫోన్‌ ఏ15 బయోనిక్ చిప్‌పై పనిచేస్తుంది. 5 జీ సేవలతో కూడిన ఐఫోన్ 13లో 6.1 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డ్‌ఆర్‌ డిస్‌ప్లే ఉంది. ఫోన్‌ వెనుక కెమెరా సెటప్ ఉంది. రెండు సెన్సార్లు 12 మెగా పిక్సెల్, ఫ్రంట్ కెమెరా 12 మెగా పిక్సెల్ ఉన్నాయి. డ్యూయల్ సిమ్ అందుబాటులో ఉంది. ఫోన్‌కు ఏడాది పాటు బ్రాండ్ వారెంటీ ఇవ్వడం జరిగింది. 


Also read:Mukesh Ambani: ముకేష్‌ అంబానీ జీతం ఎంతో తెలుసా..రిలయన్స్ వార్షిక నివేదికలో ఏముంది..?


Also read:YS Sharmila: కాళేశ్వరం అద్భుతమైన అబద్ధం..అనినీతిపై సీబీఐతో దర్యాప్తు చేయించాలన్న షర్మిల..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook